యాప్నగరం

మాకు రక్షణ కావాలి మహాప్రభో.. : జనసేన

నిన్నటి వరకూ మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ-జనసేన పార్టీలు.. జనసేన ఆవిర్భావ సభ తరువాత ఉప్పునిప్పుగా మారాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు, దూషణలతో ఏపీ పాలిటిక్స్ రంజుగా మారాయి.

Samayam Telugu 20 Mar 2018, 4:07 pm
నిన్నటి వరకూ మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ-జనసేన పార్టీలు.. జనసేన ఆవిర్భావ సభ తరువాత ఉప్పునిప్పుగా మారాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు, దూషణలతో ఏపీ పాలిటిక్స్ రంజుగా మారాయి. ఒకవైపు ప్రత్యేక హోదా ఉద్యమం ఢిల్లీ స్థాయిలో హీట్ పెంచేస్తుంటే... ఇక్కడ మాత్రం ఒకరి బొక్కలు ఒకరు బయటపెట్టే పనిలో బిజీ అయ్యారు మన లీడర్లు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని విధంగా యూటర్స్ తీసుకుని ప్రభుత్వంపై విమర్శల దాడి చేయడంతో వాటిని తిప్పికొట్టేందుకు షిప్ట్‌ల వారిగా ఏపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. నిన్న గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, నారాయణ, జవహర్, ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తిలు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా లోకేష్ సైతం తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నుండి బయటపడే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు.

అయితే అధికార టీడీపీ పార్టీ నాయకులు తమ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తూ.. బలవంతంగా టీడీపీలో జాయిన్ కావాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ జనసేన ప్రెస్ నోట్‌ రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది. అనంతపురం జిల్లాలో జనసేన కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నారని దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతూ.. జనసేన ఉపాధ్యక్షడు బి. మహేందర్ రెడ్డి ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేశారు.

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో నలభైమంది జనసేన కార్యకర్తల్ని అన్యాయంగా లాకప్‌లో ఉంచారని.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రోద్భలంతో వారిపై అక్రమంగా కేసు నమోదుచేశారంటూ జనసేన ఆరోపిస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిరాకరించిన సుబ్రహ్మణ్యం అనే జనసేన కార్యకర్తపై స్థానిక జెడ్పీటీసీ సభ్యులు దాడి చేయడాన్ని ఖండించింది జనసేన. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, జనసేన కార్యకర్తలకు రక్షణ కల్పించాలని కోరుతూ జనసేన ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.