యాప్నగరం

ఓటు విలువ నాటుకోడి పెట్టలా తయారైంది: పవన్

రాష్ట్రాన్ని కాంగ్రెస్ 40 ఏళ్లు, టీడీపీ 20 ఏళ్లు పాలించాయని ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాన్ కోరారు. యువతే తమ పార్టీకి ఇంధనం అని ఆయన అన్నారు.

Samayam Telugu 27 Jul 2018, 6:44 pm
రాష్ట్రాన్ని కాంగ్రెస్ 40 ఏళ్లు, టీడీపీ 20 ఏళ్లు పాలించాయని ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాన్ కోరారు. యువతే తమ పార్టీకి ఇంధనం అని ఆయన అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ‘ప్రజా పోరాట యాత్ర’ పర్యటన సందర్భంగా భీమవరంలో శుక్రవారం (జులై 27) పవన్ సమక్షంలో నరసాపురం, నిడదవోలు, తణుకు ప్రాంతాలకు చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు జనసేనలో చేరారు. భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్‌ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్.. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Samayam Telugu Pawan


ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. రాజకీయాన్ని బాధ్యతతో చేస్తానని చెప్పారు. ‘దోపిడీ, లంచగొండితనం లేకుండా వ్యవస్థను ప్రక్షాళన చేసి రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకొస్తాం. జనసేన ప్రశ్నించే పార్టీ మాత్రమే కాదు.. పాలించే పార్టీ. సీఎంని చేస్తేనే సమస్యను పరిష్కరిస్తానని నేను చెప్పబోను.. ఓట్లు వేసినా, వేయకపోయినా సమస్యలపై పోరాడతా’ అని పవన్ అన్నారు.

ఓటు విలువ నాటుకోడి పెట్ట విలువలాగా తయారైందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు ఒక్క పూటలో రాదని, ఆశయం, సహనం ఉండాలని జనసేన కార్యకర్తలకు సూచించారు. ‘ఏదైనా మంచి చెప్పాలంటే సినిమాల్లో రెండున్నర గంటలు చాలు. కానీ, నిజజీవితంలో 20 ఏళ్లు పడుతుంది. అందుకే మరో 25 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా’ అని ఆయన అన్నారు.

భీమవరం


యువతే తమ పార్టీకి ఇంధనమని, వారి శక్తికి స్థానిక నాయకుల అనుభవం తోడైతే రాష్ట్రంలో జనసేన బలంగా పాతుకుపోతుందని పవన్ చెప్పారు. సమాజంలో సరికొత్త రాజకీయ మార్పు తీసుకొస్తానని నమ్మి తమ పార్టీలో చేరిన అందరికీ స్వాగతం పలుకుతున్నానన్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర.. ఇలా ఏ రాష్ట్రానికి వెళ్లినా తనపై అభిమానం చూపిస్తున్నారని చెప్పారు. యువశక్తిపై విశ్వాసం ఉందన్నారు.

పవన్ చుట్టూ చిన్న పిల్లలే.. అవును, అది నిజమే!
‘మీ అందరి బాగు కోసం మీ ఇంటి నుంచి ఒకడు వచ్చి పార్టీ పెట్టాడు అంటే.. అది జనసేన పార్టీయే. వ్యక్తిగత సమస్యలను తీర్చలేను. కానీ, పబ్లిక్ పాలసీ రూపంలో అందరికీ భద్రత కలిగిన సమాజాన్ని నిర్మిస్తా. నా సుఖం నేను చూసుకొని కోట్లు సంపాదించి 60 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి రావచ్చు.. నన్ను ఎవరూ అడగరు. కానీ, దాని వల్ల ప్రయోజనం లేదు. శక్తి ఉన్నప్పుడే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రజా జీవితంలోకి వచ్చా.’ అని పవన్ అన్నారు.

జనసేనలోకి వివిధ పార్టీల నేతలు


పవన్ కళ్యాణ్ చుట్టు చిన్న పిల్లలే ఉన్నారని కొందరు విమర్శిస్తారని.. అది కరెక్టేనని ఆయన వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లోకి వచ్చిందే భావితరాల కోసంమని, దోపిడీ చేసేవారి కోసం కాదని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.