వ్యవసాయం, పశుపోషణ అనేవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతారు. ప్రకృతి ప్రేమికుడిగా ఆయన వ్యవసాయం పట్ల, జంతువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఒక సాధారణ రైతు జీవితం ప్రధానంగా ఈ రెండింటితోనే ముడివడి ఉంటుందని పవన్ చెబుతారు. రాజకీయాలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. పవన్ తనకు వీలు చిక్కినప్పుడల్లా వ్యవసాయ పనుల్లో నిమగ్నపోతారు. గోవులకు మేతను అందిస్తారు. సమాజ హితం, సంస్కృతి - సంప్రదాయాల పరిరక్షణ జనసేన ప్రధాన సిద్ధాంతాలుగా చెప్పే పవన్.. వ్యవసాయం, పశుపోషణకు అమితమైన ప్రాధాన్యం ఇవ్వాలని కార్యకర్తలతో తరచూ చెబుతారు.
మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలోనూ గోశాలను ఏర్పాటు చేశారు. సమయం చిక్కినప్పుడల్లా అక్కడి గోవులకు ఆహారం, నీరు అందిస్తారు. సిబ్బందిని వాటి ఆలనా పాలన గురించి అడిగి వివరాలు తెలుసుకుంటారు.
గురువారం (మార్చి 7) సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్ ఆవులకు మేతవేసి వాటి ఆలనాపాలన గురించి వాకబు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.