యాప్నగరం

జీవో నెం.90తో నవ్వుల పాలు.. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: పవన్

మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి.. పంచాయతీ రాజ్ చట్టాన్ని నవ్వుల పాలు చేసేలా జీవో 90.. హైకోర్టు తీర్పు శుభపరిణామం.

Samayam Telugu 23 Oct 2018, 6:36 pm
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును స్వాగతించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. హైదరాబాద్‌లో గవర్నర్‌ను కలిసిన తర్వాత మాట్లాడిన పవన్.. హైకోర్టు ఆదేశాల ప్రకారం మూడు నెలల్లో ఎన్నికలు జరగాలన్నారు. ప్రభుత్వం కూడా ఎలక్షన్లు నిర్వహిస్తుందని భావిస్తున్నానన్నారు. పంచాయతీ రాజ్ చట్టాన్ని నవ్వుల పాలు చేసేలా జీవో 90 ఉందని.. స్థానిక సంస్థల అధికారాలు నిలబెట్టేలా హైకోర్టు ఆదేశాలుండటం శుభపరిణామం అన్నారు. మొదటి నుంచి సర్పంచ్‌లకు జనసేన అండగా ఉందని.. హైకోర్టు కూడా సానుకూలంగా స్పందించడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు.
Samayam Telugu janasena chief pawan kalyan respond on ap panchayat elections and high court verdict
జీవో నెం.90తో నవ్వుల పాలు.. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: పవన్


ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనను కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.90ని హైకోర్టు కొట్టివేసింది. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ సర్పంచ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఏపీ పంచాయతీ ఎన్నికలు.. హైకోర్టు కీలక తీర్పు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.