యాప్నగరం

నిజ జీవితంలో చేయడానికే ‘సత్యాగ్రహి’ ఆపేశా: పవన్ కళ్యాణ్

వయసున్నప్పుడు, పోరాటం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు.. ఓ 25 సంవత్సరాల నా జీవితాన్ని దేశం కోసం, సమాజం కోసం, రాష్ట్రాల కోసం, మానవత్వం కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

Samayam Telugu 16 Dec 2018, 1:21 pm
జనసేన అధినేత ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ‘జనసేన ప్రవాస గర్జన’ పేరిట అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సభలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) డల్లాస్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ‘సత్యాగ్రహి’ సినిమా ప్రస్తావనను తీసుకొచ్చారు. సినిమాలో చేయబోయేది నిజజీవితంలో చేయడానికే ‘సత్యాగ్రహి’ని ఆపేశానని చెప్పారు.
Samayam Telugu Pawan_Kalyan


‘చాలా సంవత్సరాల క్రితం ‘సత్యాగ్రహి’ అనే సినిమా ఒకటి ప్రారంభించాం. ఇప్పుడు నిజ జీవితంలో నేను ఏదైతే చేస్తున్నానో అదే ‘సత్యాగ్రహి’. సినిమాల్లో పోరాటులు చేస్తే పరిష్కారాలు దొరకవు. నిజ జీవితంలోకి వచ్చి పోరాటం చేయాలి. అందుకే ఆ సినిమాను ఆపేశా. ఆ రోజున సినిమాను ఆపేసినప్పుడు అందరూ నన్ను తెగ తిట్టారు. నీకు నిలకడలేదు.. మాట్లడతావు.. చేసేస్తావ్ అన్నారు. ఆ రోజు నేను సినిమాను ఆపేసింది నిజ జీవితంలో చేయడానికి. ‘సత్యాగ్రహి’ పోస్టర్‌లో కూడా లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఫొటో ఒకవైపు ఉంటుంది.. మరోవైపు చెగువేరా ఫొటోగ్రాఫ్ ఉంటుంది’ అని పవన్ చెప్పారు.

‘వయసున్నప్పుడు, పోరాటం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు.. ఓ 25 సంవత్సరాల నా జీవితాన్ని దేశం కోసం, సమాజం కోసం, రాష్ట్రాల కోసం, మానవత్వం కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నాను. అందుకే 2014లో పార్టీని స్థాపించాను’ అని పవన్ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.