యాప్నగరం

ఎమ్మెల్యే ప్రాణాల్నే కాపాడలేని వ్యక్తి ఏపీ సీఎం: పవన్

పంచాయతీ ఎన్నికల్లో సైతం గెలవలేని నారా లోకేశ్, పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రిగా ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు.

Samayam Telugu 3 Nov 2018, 11:52 pm
కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీని వెనకేసుకు రావడానికి తానేమీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులా అవకాశవాదిని కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సామాజిక మార్పు కోసమే జనసేన పార్టీని స్థాపించానని, బీజేపీలో, లేక ఇతర పార్టీలలో కలపడానికి కాదని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో శనివారం జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు.
Samayam Telugu Pawan Kalyan


కేంద్రం మెడలు వంచేందుకు జాతీయ నేతలను కూడగడుతున్నానని చెబుతున్న చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీతో గొడవ పెట్టుకునే నైతిక బలం లేదని అభిప్రాయపడ్డారు. టీడీపీ అవినీతిలో భాగస్వామ్యం పంచుకోవడం ఇష్టం లేని కారణంగా తాను ఒక్క పదవిని కూడా స్వీకరించలేదని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలను టీడీపీ కార్మికులుగా చేశారని చంద్రబాబును విమర్శించారు. ఎమ్మెల్యేల ప్రాణాలను కాపాడలేని చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమర్ధుడేనా అని పవన్ సూటిగా ప్రశ్నించారు.

వియ్యంకుడికి పోలవరం కాంట్రాక్టు పనులు ఇప్పించడంలో ఉన్న ఉత్సాహం.. తన నియోజకవర్గంలో కాలుష్యాన్ని నివారించడంలో లేదంటూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడిని ఎద్దేవా చేశారు. ఏపీకి అన్యాయం జరిగిందనిపిస్తే ప్రత్యేక హోదా కోసం ఉమ్మడిగా పోరాటం చేసేందుకు టీడీపీ సిద్ధంగా ఉండాలన్నారు. ఇలాంటి విషయాలలో యనమల, చంద్రబాబుకు సలహా ఇవ్వడం మంచిదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సైతం గెలవలేని నారా లోకేశ్, పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రిగా ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.