యాప్నగరం

జనసైనికుల అత్యుత్సాహం.. ఎస్సై కాలు విరిగింది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనా పవన్ అభిమానులకు పూనకం వచ్చేస్తోంది. అలాంటి తాము దైవంలా భావించే నటుడే తమకోసం నాయకుడై తమ ముందుకొస్తే పవన్ అభిమానులు ఊరుకుంటారా..

TNN 24 Jan 2018, 10:26 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనా పవన్ అభిమానులకు పూనకం వచ్చేస్తోంది. అలాంటి తాము దైవంలా భావించే నటుడే తమకోసం నాయకుడై తమ ముందుకొస్తే పవన్ అభిమానులు ఊరుకుంటారా.. రక్తం చిందుతున్నా, లేవలేని పరిస్థితుల్లో ఉన్నా.. తమ అభిమాన నటుడ్ని చూడాలన్న ఆకాంక్ష పవన్ యాత్రవైపు జనసైనికులను నడిపిస్తుంది. అయితే వీరిలో కొంతమంది అభిమానులు అత్సుత్సాహం ప్రదర్శిస్తుండటంతో జనసేన అధినేత జనయాత్రలో అపశృతులు చోటుచేసుకుంటున్నాయి.
Samayam Telugu janasena chief pawan kalyan telangana political tour day 3 updates at khammam
జనసైనికుల అత్యుత్సాహం.. ఎస్సై కాలు విరిగింది!


మంగళవారం నాడు కారు అద్దాలు పగిలి ఒక అభిమానికి గాయాలైతే.. బుధవారం ఒక ఆగంతకుడు పవన్ మీద చెప్పు విసిరి పారిపోయాడు. ఇక విధి నిర్వహణలో భాగంగా.. పవన్ యాత్రకు వస్తున్న అభిమానుల్ని కంట్రోల్ చేస్తున్న ఓ పోలీసు అధికారి పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహానికి ఆస్పత్రిపాలయ్యాడు.

బుధవారం ఖమ్మం జిల్లాలో జనసైనికుల ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా.. పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదికి వచ్చే సమయంలో ఆయన కోసం అభిమానులంతా ఒక్కసారిగా ఎగబడడంతో కంట్రోల్ చేయబోయిన ఖమ్మం రూరల్ ఎస్సై చిరంజీవి కాలు విరిగింది. ఆయనతో పాటు అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులకు కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.