యాప్నగరం

మన్యంలో జనసేనాని.. అడుగడుగునా నీరాజనం

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా మన్యం పర్యటనలో భాగంగా అరకులోయ పరిసరప్రాంతాల్లో ఉన్న గిరిజన తండాలు, గ్రామాల్లో పర్యటించారు.

Samayam Telugu 6 Jun 2018, 10:22 am
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా మన్యం పర్యటనలో భాగంగా అరకులోయ పరిసరప్రాంతాల్లో ఉన్న గిరిజన తండాలు, గ్రామాల్లో పర్యటించారు. పోతంగి, తోటవలస, కొత్తవలస ప్రాంతాల్లో ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు . డుంబ్రిగూడలోని కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలను, అక్కడ ఉనన వసతి గృహాలను పరిశీలించారు. విద్యార్థినులతో పాటు నేల మీద కూర్చున్న ఆయన బాలికల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. బాలికల వసతి గృహాలకు భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్ల రాత్రిళ్లు ఆకతాయిల వేధింపులు ఎక్కువగా ఉన్నాయని విద్యార్థినులు వాపోయారు. కనీసం ప్రహారి గోడ కూడా లేదన్నారు. భోజన శాలలు, బెడ్ రూంలలో కిటికీలు తలుపులు లేనికారణంగా పాములు లోపలికి వచ్చేస్తున్నాయని బాలికలు సమస్యల్ని ఏకరువు పెట్టారు. గిరిజనులకు ఎప్పుడూ జనసేన అండగా ఉంటుందని మీ సమస్యలు త్వరలోనే పరిష్కారం అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతా అని హామీ ఇచ్చి అక్కడ నుండి కురిడి, గాలికొండ వ్యూ పాయింట్ చేరుకుని బాక్సైట్ కొండలను పరిశీలించారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్

బాక్సైట్ తవ్వకాల వల్ల ఊళ్లు వదిలి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు గ్రామస్తులు. పోతంగి గ్రామస్తులకి తాగునీటి ఆధారమైన బావి వద్దకు వెళ్లి, స్వయంగా నీటిని తోడి పరిశీలించారు పవన్ కళ్యాణ్. బురద, క్రిమి కీటకాలమయంగా ఉన్న ఆ నీరు గిరిజనులకి జీవనాధారమన్న విషయాన్ని గిరిజనుల నుంచి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆ నీటిని పరీక్షల నిమిత్తం సేకరించి, విశాఖ పంపారు. కాళ్లు, మెడ వాపులు లాంటి సీజనల్ వ్యాధులకు గురైన చిన్నారులని పరిశీలించారు.
ఈ కలుషిత నీటి వల్ల ఏటా రోగాల బారిన పడుతున్నామని, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలతో నానా ఇబ్బందులు పడుతున్నామంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. డాక్టర్ల కొరత ఉందని.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 108కి కాల్ చేస్తే.. డ్రైవర్ లేరు, డీజిల్ లేరు అంటున్నారు. మా కాఫీ తాగి.. మాకు ఎలాంటి వసతులు లేకుండా చేసి ఇక్కడ నుండి గెంటేస్తున్నారంటూ పవన్‌కి గిరిజనులు తమ సమస్యల్ని ఏకరువు పెట్టారు.

అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్.. అడవిబిడ్డల్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని.. వెంటనే విశాఖ మన్యంలో వ్యాధుల అదుపునకు ప్రభుత్వం ఆరోగ్య అత్యవసర స్థితి (హెల్త్‌ ఎమర్జెన్సీ) ప్రకటించాలని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.