యాప్నగరం

ప్రభుత్వ వృద్ధాశ్రమాలు.. జనసేన విజన్ డాక్యుమెంటరీ

ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విజన్ డాక్యుమెంటరీని ప్రకటించిన జనసేన పార్టీ.. ప్రభుత్వం తరఫున వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

Samayam Telugu 17 Aug 2018, 12:03 pm
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ విజన్ డాక్యుమెంటరీని ప్రకటించింది. మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బహిర్గతం చేశారు. మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన ఆయన.. అలా చేయలేని పక్షంలో భారత మాత అనడం సముచితంగా ఉండదని అభిప్రాయపడ్డారు. గృహిణులకు ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తామని, రేషన్‌కు బదులుగా రూ.2500 నుంచి రూ.3000 వరకు నగదును అకౌంట్లలో వేస్తామని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే.
Samayam Telugu old age homes


కాపుల రిజర్వేషన్లు, బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు.. తదితర అంశాలను కూడా జనసేనాని ప్రస్తావించారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న పవన్.. వృద్ధుల కోసం ప్రభుత్వం తరఫున ఆశ్రమాలు నిర్వహిస్తామని కూడా తెలిపారు. కన్నబిడ్డలకు తల్లిదండ్రులను చూసుకోవడం ఇబ్బంది అయితే.. మీ తల్లిదండ్రులను జనసేన ప్రభుత్వం చూసుకుంటుందని ఆ పార్టీ హామీ ఇచ్చింది. ప్రభుత్వం తరఫున వృద్ధాశ్రమాల నిర్వహించడమనే నిర్ణయం ఓ రకంగా సాహసమనే భావించొచ్చు.

కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సంప్రదాయం.. ఇలా ఏడు అంశాలతో జనసేన పార్టీ సిద్ధాంతాలను ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.