యాప్నగరం

Janasena: టీడీపీ కుంభస్థలంపై కొడతాం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం - పవన్ కాన్ఫిడెంట్‌

రాయలసీమలో పరిశ్రమలు పెట్టాలంటే సీఎం కొడుక్కి, ప్రతిపక్ష నేతకు వాటాలు ఇవ్వాలి. అందుకే పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. జనసేన ప్రభుత్వం వచ్చాక తప్పకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పారిశ్రామిక వేత్తలు మాటిచ్చారు - పవన్ కళ్యాణ్

Samayam Telugu 3 Dec 2018, 11:32 am
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కుంభస్థలం మీద కొడతామన్న పవన్ కళ్యాణ్.. 2019లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జనసేన పాలనలో వందలాది విదేశీ కంపెనీలు వస్తాయన్న పవన్.. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆదివారం అనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొడుకు మీది ప్రేమతో చంద్రబాబు ధృతరాష్ట్రుడిలా మారిపోయాడని జనసేనాని ఎద్దేవా చేశారు.
Samayam Telugu pawan at anantpur


అధికార పార్టీ ఆగడాలను నిలదీయడంలో ప్రతిపక్ష నేతగా జగన్ విఫలమయ్యారన్నారు. ప్రధాని మోదీ అంటే జగన్, చంద్రబాబు, లోకేశ్‌లకు భయం ఉంది. తనకు మాత్రమే భయం లేదని పవన్ తెలిపారు. రాయలసీమలో రతనాలు పాలకులకు, రాళ్లు ప్రజలకంటూ పాలకుల తీరుపై చురకలు అంటించారు.
విదేశాలకు వెళ్లినప్పుడు కరవు ప్రభావిత ప్రాంతమైన రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పారిశ్రామికవేత్తలను కోరానని పవన్ తెలిపారు. కానీ ఇక్కడికి అవినీతికి వారు భయపడ్డారు. పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ముఖ్యమంత్రి కొడుక్కి, ప్రతిపక్ష నేతకు వాటాలు ఇవ్వాలని వారు నాతో చెప్పారని జనసేనాని తెలిపారు. జనసేన ప్రభుత్వం ఏర్పాటవుతుంది, ఆ తర్వాత పెట్టుబడులు పెడతామని పారిశ్రామికవేత్తలు చెప్పారు. అది వారికి జనసేనపై ఉన్న నమ్మకం అని పవన్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.