యాప్నగరం

‘జనబాట’కు శ్రీకారం చుట్టిన పవన్ కల్యాణ్

బూత్ స్థాయిలో పోలింగ్ కేంద్రాలు కీలకమని, పవన్‌ను సీఎంగా చేయడంలో భాగంగా జనబాట కార్యక్రమాన్నివిజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Samayam Telugu 2 Oct 2018, 10:24 pm
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జనబాటకు శ్రీకారం చుట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని నోవా ఇంజనీరింగ్‌ కాలేజీలో మంగళవారం జనబాట కార్యక్రమాన్ని పవన్‌ ప్రారంభించారు. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జనసైనికులు జనబాట కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు గల్లంతు అవ్వకుండా, ప్రతి ఇంటిని జల్లెడపట్టి నూతన ఓటర్లను నమోదు చేసేలా పని చేస్తారని జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ తెలిపారు.
Samayam Telugu Pawan Kalyan


బూత్ స్థాయిలో పోలింగ్ కేంద్రాలు కీలకమని, పవన్‌ను ముఖ్యమంత్రిగా చేయడంలో భాగంగా జనబాట కార్యక్రమాన్నివిజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో 31 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని కారణం అడిగితే రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రవాళ్లు సొంత ప్రాంతానికి వెళ్లారని చెప్పారు. కానీ విచిత్రంగా ఏపీలోనూ 21 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని నివేదికల్లో తేలిందన్నారు. జనసేన కార్యక్రమాలు ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ మాత్రమే ఓట్లు గల్లంతవుతున్నాయని పేర్కొన్నారు.
కాగా, జనసేన జనబాట పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం పవన్ మాట్లాడుతూ.. ‘నా కోసం చచ్చిపోతా అన్నా అని చాలామంది అంటారు, మీరు చావటం కాదు ముందు వెళ్లి ఓటు ఉందో లేదో చూసుకొని ఓటు లేకపోతే నమోదు చేసుకోవాలని’ సూచించారు. ఈ నెలాఖరు వరకు ఓట్ల నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.