యాప్నగరం

నా భర్త గుండు కొట్టించే వ్యక్తి కాదు: పరిటాల సునీత

ఇది ఇప్పటి విషయం కాదు. చాలా సంవత్సరాల క్రితం నుంచి నానుతున్నదే. దీనిపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ వివరణ కూడా ఇచ్చారు. కానీ ఇంకా కొంతమందిలో ఏవో అనుమానాలు.

TNN 28 Jan 2018, 6:56 pm
ఇది ఇప్పటి విషయం కాదు. చాలా సంవత్సరాల క్రితం నుంచి నానుతున్నదే. దీనిపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ వివరణ కూడా ఇచ్చారు. కానీ ఇంకా కొంతమందిలో ఏవో అనుమానాలు. వాటినీ క్లియర్ చేస్తూ తాజాగా పరిటాల సునీత కూడా ఈ విషయంపై స్పందించారు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మీరనుకున్నదే.. తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల రవి.. పవన్ కళ్యాణ్‌కు గుండు కొట్టించారట. కానీ అలాంటిదేమీ లేదని, తన భర్త అలాంటి వారు కాదని పరిటాల సునీత వివరించారు. ఆదివారం అనంతపురం పర్యటనకు వెళ్లిన పవన్.. కదిరి బయలుదేరి వెళ్లడానికి ముందు మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. అక్కడే అల్పాహారం తీసుకున్నారు. అనంతరం సుమారు గంటపాటు అనేక విషయాలపై సునీత, పవన్ చర్చించారు.
Samayam Telugu janasenaparty chief pawan kalyan met paritala sunitha
నా భర్త గుండు కొట్టించే వ్యక్తి కాదు: పరిటాల సునీత


భేటీ అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌కు తన భర్త పరిటాల రవి గుండుకొట్టించారని వచ్చిన వార్తలపై సునీత స్పందించారు. తాము కూడా పేపర్లు, టీవీల్లో చూడటం, అక్కడా ఇక్కడ జనం మాట్లాడుకుంటే వినడం తప్ప తన భర్త ఎవరికీ గుండు కొట్టించలేదని సనీత స్పష్టం చేశారు. అసలు పరిటాల రవి గుండు కొట్టించే వ్యక్తి కాదని అన్నారు. ప్రతి ఒక్కరినీ ఆయన ప్రోత్సహించే వ్యక్తేగానీ ఎవర్నీ ఇబ్బంది పెట్టరని చెప్పారు. తన భర్తను పవన్ ఎప్పుడూ చూడలేదని, ఎవరో ఏదో అనుకుంటున్నారని తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సునీత తేల్చి చెప్పారు.

పవన్‌ తమ ఇంటికి అతిథిగా వస్తున్నారని తెలుసుకున్న మంత్రి సునీత అల్పాహారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వయంగా ఆమే వంటకాలను సిద్ధం చేశారు. ఇడ్లీ, వడ, దిబ్బరొట్టెతోపాటు రాయలసీమకే ప్రత్యేకమైన రాగి సంకటి, పొంగల్‌ను తయారుచేయించారు. పరిటాల కుటుంబంతో కలిసి పవన్ కళ్యాణ్ అల్పాహారాన్ని తీసుకున్నారు. అనంతరం రాయలసీమలో కరవు పరిస్థితులు, రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు తాగు నీటి సమస్య తదితరాలపై సునీతతో పవన్ చర్చించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.