యాప్నగరం

జోగిని శ్యామల కంటతడి.. సిగ్గులేదా ఈ ప్రభుత్వానికి అంటూ ఫైర్

బోనాల జాతరలో జోగిని శ్యామల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఏటా హైదరాబాద్‌లో జరిగే గోల్కోండ, లష్కర్ బోనాల్లో పాల్గొని బోనమెత్తి ఆడతారు.

Samayam Telugu 29 Jul 2018, 6:50 pm
బోనాల జాతరలో జోగిని శ్యామల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఏటా హైదరాబాద్‌లో జరిగే గోల్కోండ, లష్కర్ బోనాల్లో పాల్గొని బోనమెత్తి ఆడతారు. అమ్మవారిపై ఎంతో భక్తితో ఆడిపాడే శ్యామల ఈసారి లష్కర్ బోనాలలో మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. భావోద్వేగం ఆపుకోలేక కంటతడి పెట్టారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల (లష్కర్ బోనాలు) జాతరను ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుపై మండిపడ్డారు. మీడియా ముందుకు వచ్చిన తన బాధను వెలిబుచ్చుకున్నారు.
Samayam Telugu Shyamala


ఒక్కొక్కరు 10 కిలోల బరువు బోనంతో క్యూ లైన్లో నిలబడి ఉంటే, వాళ్లందరినీ ఆపేసి ఎంపీలు, ఎమ్మెల్యేలను పంపడమేంటని శ్యామల ప్రశ్నించారు. బోనాలకు గొప్పగా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోందని, ఇవేనా ఏర్పాట్లు అని మండిపడ్డారు. 26 ఏళ్లుగా తాను బోనాలు చేస్తున్నానని, సంప్రదాయ సంస్కృతులను కాపాడుతున్నానని ఆమె చెప్పారు. బోనం ఎత్తుకుని వస్తున్న తనను పోలీసులు గుండెలపై చేయివేసి తోసేశారని, ఇన్నేళ్లలో ఎప్పుడూ తాను ఇంత అవమానానికి గురి కాలేదని శ్యామల కంటతడి పెట్టుకున్నారు. ‘ఇదేనా మీరు తెచ్చుకున్న తెలంగాణ.. సిగ్గులేదా మీకు’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడపడుచును ఈ ప్రభుత్వం అవమానించిందని, కచ్చితంగా ఈ ప్రభుత్వం పడిపోతుందని శ్యామల బల్లగుద్ది చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.