యాప్నగరం

కొన్ని గంటల్లోనే మర్డర్ కేసు చేధించారు

కడప పోలీసులు హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మర్డర్ కేసును ఛేదించి... హంతకులను అరెస్టు చేశారు.

TNN 20 Oct 2016, 7:17 pm
కడప పోలీసులు హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మర్డర్ కేసును ఛేదించి... హంతకులను అరెస్టు చేశారు. కడపలోని జువైనల్ హోంలో పదహారేళ్ల ముస్తఫా ఉంటున్నాడు. దొంగతనం కేసులో అరెస్టయి నాలుగు నెలల నుంచి ఇక్కడే నివసిస్తున్నాడు. కాగా గురువారం తెల్లవారుజామున బాత్రూమ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. హోం నిర్వాహకులు విషయాన్ని పోలీసులకు చేర్చారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించిన కొన్ని గంటల్లోనే హంతకులను అరెస్టు చేశారు.
Samayam Telugu juvenile home murder case culprits arrested in cuddapah
కొన్ని గంటల్లోనే మర్డర్ కేసు చేధించారు


పోలీసుల కథనం ప్రకారం... ప్రొద్దుటూరుకు చెందిన మహబూబ్ భాషా, గౌతమ్ లు కూడా జువైనల్ హోంలో ఉంటున్నారు. వారిద్దరికి బుధవారం రాత్రి ఏదో విషయంలో గొడవ ఏర్పడింది. వారికి సర్ది చెప్పేందుకు ముస్తఫా మధ్యలో కలిగించుకున్నాడు. అది వారిద్దరికీ కోపం తెప్పించింది. ముస్తఫాను ఎవరూ చూడకుండా బాత్రూమ్ లోకి తీసుకెళ్లి, అక్కడే గొంతుకు టవల్‌తో ఉరివేసి చంపేశారు. ఏం తెలియనట్టు తమ ప్రదేశాలకి వెళ్లిపోయారు. చివరికి పోలీసులు దర్యాప్తులో దొరికిపోయారు. ఇద్దరినీ హత్య కేసులో అరెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.