యాప్నగరం

ఢిల్లీలోనే టీడీపీ ఎంపీలు.. అపాయింట్‌మెంట్ ఇవ్వని ప్రధాని

కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ పోరును ఉధృతం చేసింది. ఇటు ఎంపీ సీఎం రమేష్ కొనసాగుతుంటే.. అటు ఆయనకు మద్దతుగా పార్టీ ఎంపీలు ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

Samayam Telugu 28 Jun 2018, 12:16 pm
కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ పోరును ఉధృతం చేసింది. ఇటు ఎంపీ సీఎం రమేష్ కొనసాగుతుంటే.. అటు ఆయనకు మద్దతుగా పార్టీ ఎంపీలు ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన నేతలు.. ఇవాళ ప్రధానిని కలవాలని భావించారు. మోదీకి స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు.. సీఎం రమేష్ దీక్ష గురించి వరరించాలలి భావించారు. అందుకే ఇవాళ పీఎంవోలో అపాయింట్‌‌మెంట్ కోసం ప్రయత్నించినా దొరకలేదు.
Samayam Telugu TDP MPS


ప్రధాని అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో ఎంపీలు ఏపీ భవన్‌లో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అలాగే ఇవాళ మరోసారి ఉక్కుమంత్రి బీరేంద్ర్ సింగ్‌ను కలిసి సీఎం చంద్రబాబు రాసిన లేఖను అందజేయనున్నారు. ఇదిలా ఉంటే కేంద్రం తీరుపై ఎంపీలు మండిపడుతున్నారు. నిన్న బీరేంద్ర్ సింగ్‌నను కలిసినా ఆయన నుంచి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనోభావాలతో కూడిన అంశంపై ఇలా నిర్లక్ష్యంగా మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. అలాగే కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.