యాప్నగరం

కేసీఆర్‌‌పై కాపు నేత ముద్రగడ ప్రసంశల జల్లు

ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రసంశల జల్లు కురిపించారు.

Samayam Telugu 17 Apr 2017, 5:40 pm
ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రసంశల జల్లు కురిపించారు. ఎస్టీలు, ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు ఆయన కేసీఆర్ ను అభినందించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలన్నింటినీ అమలు చేసిన మొదటి సీఎం కేసీఆర్ అంటూ ముద్రగడ బహిరంగ అభినందన లేఖ రాశారు.
Samayam Telugu kapu leader mudragada praises kcr over muslim st reservations
కేసీఆర్‌‌పై కాపు నేత ముద్రగడ ప్రసంశల జల్లు


‘ఎన్నికల సమయంలో మీ తెలంగాణ రాష్ట్రంలో మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు చాలా తక్కువ సమయంలో అమలు చేశారు. గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం చూస్తుంటే అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల కోసం పాటుపడ్డ దళిత మహాభావుడు అంబేద్కర్ బాటలో మీ ప్రయాణం మరువలేని’’ అని ముద్రగడ కేసీఆర్ ను కొనియాడారు.

ఓట్లు వేసిన వారిని గౌరవించాలి. మా సీఎం చంద్రబాబు గారి మాదిరిగా ఇచ్చిన హామీలు అడిగితే లాఠీలతో కొట్టించడం, అక్రమ కేసులు పెట్టి బాధించడం.. వంటి కార్యక్రమాలు తీసుకోకండి అంటూ లేఖలో పేర్కొన్నారు.

పదవులు, ఆస్తులు శాశ్వతం కాదని చెప్పిన ముద్రగడ, పేరు, ప్రతిష్టలే శాశ్వతమని పరోక్షంగా చంద్రబాబును విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.