యాప్నగరం

కాపు నేత ముద్రగడ హౌస్ అరెస్ట్

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

TNN 24 Jan 2017, 5:22 pm
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఎలాంటి అనుమతి తీసుకోకుండా పాదయాత్ర చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. బుధవారం రావుల పాలెం నుంచి అంతర్వేది వరకు ఈ యాత్రను చేయాలని భావించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా పాదయాత్రను అనుమతించబోమని ముందుగానే తెలియజేసింది. అయినా ముద్రగడ తన పాదయాత్ర చేసి తీరుతానని తెలియజేశారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని భావించిన పోలీసులు అతని స్వగ్రామమైన కిర్లంపూడిలో భారీగా మోహరించారు. అతని ఇంటి చుట్టూ పోలీసులు రౌండప్ చేశారు. ఈ దృశ్యాలన్నింటినీ రికార్డు చేసేందుకు ముద్రగడ తన ఇంటి చుట్టూ ముందుగానే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
Samayam Telugu kapu leader mudragada under house arrest
కాపు నేత ముద్రగడ హౌస్ అరెస్ట్


ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం అయిదుగంటల ప్రాంతంలో పోలీసులు ముద్రగడను గృహనిర్భంధంలో ఉంచారు. పోలీసులు మంగళవారం మధ్యాహ్నమే భారీగా కిర్లంపూడి చేరుకున్నాయి. ఏ క్షణం ఏమవుతుందా అని అంతా ఉత్కంఠగా చూశారు. పోలీసులు అడుగుపెట్టిన కొద్దిగంటల్లోనే ముద్రగడను ఇంట్లోంచి బయటికి రాకూండా హౌస్ అరెస్టు చేశారు. విషయం ఇప్పుడిప్పుడే అతని అనుచరులకు, అభిమానులకు తెలియడంతో వారు రాక మొదలైంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తంగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.