యాప్నగరం

అమిత్ షా, బాబు వార్..మధ్యలో సిద్ధ రామయ్య

అమిత్ షా, చంద్రబాబు వార్ వరకు ఓకే కాని... మధ్యలో సిద్ధ రామయ్య ఎందుకొచ్చారనే కదా మీ డౌటు. అక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది.

Samayam Telugu 26 Mar 2018, 1:16 pm
అమిత్ షా, చంద్రబాబు వార్ వరకు ఓకే కాని... మధ్యలో సిద్ధ రామయ్య ఎందుకొచ్చారనే కదా మీ డౌటు. అక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. మొన్న చంద్రబాబుకు అమిత్ షా లేఖ రాశారు. అందులో రాష్ట్రానికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన నిధుల ప్రస్తావన తీసుకొచ్చారు. దీనికి ఏపీ సీఎం కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అలాగే ఓ ట్వీట్ కూడా చేశారు. దీన్నే అస్త్రంగా చేసుకొని కర్ణాటక సీఎం రెచ్చిపోయారు. అమిత్ షాపై ఓ రేంజ్‌లో మండిపడ్డారు. రాష్ట్రాలకు హక్కుగా నిధులొస్తాయని... వాటిని ఏదో దానంగా ఇస్తున్నట్లు భావిస్తున్నారని సెటైర్ వేశారు.
Samayam Telugu Sidda Ramiaah


కర్ణాటకకు రూ.2లక్షల కోట్లు ఇచ్చామని గొప్పలు చెబుతున్నారని... ఇచ్చింది మాత్రం రూ. 90వేల కోట్లేనని చెప్పారు. అమిత్ షాకు కేంద్ర-రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీపై కూడా అవగాహనలేదని విమర్శించారు. సిద్ధ రామయ్య తన ట్వీట్‌లో చంద్రబాబు చేసిన ట్వీట్‌ను కూడా కోట్‌ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.