యాప్నగరం

శివనామస్మరణంతో మార్మోగుతున్న ఆలయాలు

కార్తీక మాసం ప్రారంభమైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది.

TNN 31 Oct 2016, 9:06 am
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం ప్రారంభమవడంతో శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. పైగా సోమవారం రోజున కార్తీక మాసం మొదలవడంతో దీనికి మరింత విశిష్ఠత నెలకొంది. కార్తీక మాసంలో సోమవారం అంటే పరమ శివుడికి ఇష్టమైన రోజు అని..ఈ రోజు గనుక కైలాన నాధుడిని దర్శించుకుంటే.. కోరికలు తప్పకుండా తీరుతాయని భక్తుల నమ్మకం.. అందుకే ఈ రోజున శివుడిని దర్శించుకునేందుకు భక్తుల బారులు దీరుతున్నారు...
Samayam Telugu karthika masam starts
శివనామస్మరణంతో మార్మోగుతున్న ఆలయాలు




కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ద్రాక్షారామం, అమరావతి, భీమవరం, పాలకొల్లు శ్రీశైలం, మహానంది,యాగంటి, శ్రీకాళహస్తి, తిరుపతి కపిలతీర్థం శైవక్షేతాల్లో అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే వేములవాడ, కీసర, వరంగల్ వేయిస్తంభాల గుడి దేవాలయాల్లో పరమ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 2గంటలకే ఆలయ ద్వారాలు తెరిచారు. పరమశివుడికి పాలభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణంతో ఆలయాలు మార్మోగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.