యాప్నగరం

జనసేన కవాతు: పెరుగుతున్న బలం.. రంగంలోకి ‘రెడ్ రెవల్యూషన్’

జనసేన కవాతులో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు, ఆయన అభిమానులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన ట్విట్టర్ అకౌంట్ ద్వారా దీనికి అధిక ప్రాచుర్యం కల్పిస్తున్నారు.

Samayam Telugu 7 Dec 2022, 2:04 pm
వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉండటంతో ప్రజల్లోకి మరింతగా వెళ్లడానికి జనసేనాని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ‘ప్రజా పోరాట యాత్ర’ పేరిట ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగడుతున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు పార్టీ బలాన్ని నిరూపించుకోవడానికి ‘జనసేన కవాతు’ను నిర్వహించడానికి పూనుకున్నారు. అక్టోబర్ 15న తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీపై ఈ కవాతును నిర్వహించనున్నారు.
Samayam Telugu Janasena


జనసేన కవాతులో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు, ఆయన అభిమానులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన ట్విట్టర్ అకౌంట్ ద్వారా దీనికి అధిక ప్రాచుర్యం కల్పిస్తున్నారు. జనసేన నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమం కోసం నడుం బిగించారు. జనసేనాని కోసం జనసైనికులు అంతా కదలి రావాలని కోరుతున్నారు. ముఖ్యంగా యువతలో స్ఫూర్తిని నింపి పార్టీ బలాన్ని పెంచుతున్నారు.
‘రెడ్ రెవల్యూషన్’ అనే కొత్తరకం ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షించిన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం జనసేన నాయకుడు కస్తూరి నాని.. జనసేన కవాతు కోసం తన దండును సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గంలోని జనసైనికులు, పవన్ అభిమానులు ఈ కవాతుకు తరలి రావాలని పిలుపునిస్తున్నారు. రెడ్ రెవల్యూషన్ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.