యాప్నగరం

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నూతనంగా నిర్మించిన అధికారిక నివాసం ‘ప్రగతి భవన్’లోకి గురువారం ఉదయం 5గంటల 22 నిమిషాలకు గృహ ప్రవేశం చేశారు.

Samayam Telugu 24 Nov 2016, 11:08 am
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నూతనంగా నిర్మించిన అధికారిక నివాసం ‘ప్రగతి భవన్’లోకి గురువారం ఉదయం 5గంటల 22 నిమిషాలకు గృహ ప్రవేశం చేశారు.
Samayam Telugu kcm enters new house pragati bhavan
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన కేసీఆర్


నూతన గృహంలో కేసీఆర్ దంపతులు సుదర్శన యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామితోపాటు మంత్రులు మహమూద్ అలీ, హరీశ్ రావు, కేటీఆర్, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు.



దాదాపు పదేకరాల విస్తీర్ణంలో నిర్మించిన సీఎం అధికారిక నివాసానికి ప్రగతి భవన్ గా నామకరణం చేశారు. ఇక్కడ సీఎం మీటింగ్ హాల్, క్యాంపు కార్యాలయాలు నిర్మించారు. సీఎం మీటింగ్ హాలుకు ‘జనహిత’ అని పేరు పెట్టారు.


జనహిత భవన్ లో ప్రభుత్వ విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు తదితర అంశాలపై రైతులు, కార్మికులు, ఉద్యోగులు, తదితర వర్గాలతో సీఎం సమాలోచనలు జరిపేందుకు వీలుగా నిర్మించారు.

రూ.38కోట్ల వ్యయంతో మూడు బ్లాకులుగా ఐదు భవనాల నిర్మాణం చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.