యాప్నగరం

పరమవీర చక్ర పొందితే రూ.2.25కోట్లు: కేసీఆర్

అవార్డులు పొందిన సైనికులకు రాష్ట్రప్రభుత్వం కూడా పారితోషికాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేసీఆర్ తెలిపారు.

TNN 17 Jan 2017, 1:42 pm
దేశ భద్రతలో అసమాన ప్రతిభ చూపిన సైనికులకు కేంద్రం పరమ వీరచక్ర వంటి అవార్డులతో సత్కరిస్తుంది. అవార్డులు పొందిన తెలంగాణకు చెందిన సైనికులకు రాష్ట్రప్రభుత్వం కూడా పారితోషికాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేసీఆర్ తెలిపారు. ఆయన అసెంబ్లీలో సైనికుల సంక్షేమనిధి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం అవార్డులు పొందిన వారికి ఎంతెంత పారితోషికం ప్రభుత్వం అందిస్తుందో తెలిపారు. పరమవీరచక్ర అవార్డు పొందిన తెలంగాణ సైనికునికి రూ.2.25 కోట్లు అందిస్తామని చెప్పారు. మహావీరచక్ర, కీర్తి చక్ర అవార్డులు పొందిన తెలంగాణ బిడ్డకు 1.25 కోట్ల రూపాయలు ఇస్తామని తెలిపారు. వీర చక్ర, శౌర్య చక్ర అవార్డులు పొందిన వారికి రూ.75 లక్షలు ఇవ్వాలని, సేవా మెడల్, గ్యాలంట్రీ అవార్డు పొందినవారికి రూ.30లక్షలు ఇవ్వాలని, పెన్షన్ ఇన్ డిస్పాచెస్ గ్యాలంట్రీ అవార్డు పొందిన వారికి రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.
Samayam Telugu kcr announces cash award for defence personnel
పరమవీర చక్ర పొందితే రూ.2.25కోట్లు: కేసీఆర్


అలాగే సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడల్ పొందిన వారికి రూ.25 లక్షల రూపాయలు, ఉత్తమ యుద్ధ సేవ మెడల్ పొందిని వారికి రూ.20 లక్షలు, యుద్ధ సేవా మెడల్ వచ్చిన వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని తెలంగాణ సర్కారు నిర్ణయించినట్టు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.