యాప్నగరం

పూజారులకూ పే స్కేల్: సీఎం కేసీఆర్

తెలంగాణలోని పూజారులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వారికి పే స్కేలు అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 15) ఆయన అర్చకులతో..

TNN 15 Sep 2017, 4:06 pm
తెలంగాణలోని అర్చకులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వారికి పే స్కేలు అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 15) ఆయన అర్చకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అర్చకుల సమస్యలు, వేతనాల పెంపు, చెల్లింపులు, ఆలయాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. నవంబర్ నుంచి అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పే స్కేలు అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ‘ధూప దీప నైవేద్య’ పథకాన్ని మరో 3000 దేవాలయాలకు వర్తింపజేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం రాష్ట్రంలోని 1805 దేవాలయాల్లో అమలవుతోంది.
Samayam Telugu kcr announces pay scale for priests in telangana as dasara gift
పూజారులకూ పే స్కేల్: సీఎం కేసీఆర్


పూజారులకు కేసీఆర్.. దసరా కానుకగా పే స్కేలు అమలు ప్రకటించారు. ‘అర్చకులకు గౌరవ మర్యాదలకు లోటు లేకున్నా.. పూట గడవడమే కష్టంగా మారింది. అర్చక వృత్తిలో ఉన్నవారికి అమ్మాయిలనిచ్చి పెళ్లి చేయడానికే భయపడుతున్నారు. ఈ పరిస్థితి మారాలి’ అని ఆయన అన్నారు. ఇక నుంచి 5,625 మంది అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు అందజేస్తామని సీఎం తెలిపారు.

దేవాలయాల నిర్వహణ, సంబంధిత అంశాల పర్యవేక్షణ కోసం ‘ధార్మిక పరిషత్’ ఏర్పాటు చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని, తుమ్మల, జూపల్లితో పాటు ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నర్సింగ రావు తదితరులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.