యాప్నగరం

Nirudyoga Bruthi: ఏపీ కంటే తెలంగాణలో మూడురెట్లు

ఓ వైపు ఉద్యోగ నియామకాలు చేపడుతూనే మరోవైపు జాబ్ లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులను ఆదుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 16 Oct 2018, 9:03 pm
టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టో అంటూనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల వారికి వరాల జల్లులు ప్రకటించారు. ముఖ్యంగా నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3016 రూపాయల నిరుద్యోగ భృతిని అందించనున్నట్లు వెల్లడించారు. ఏపీలో గత ఎన్నికల ప్రచారంలో నెలకు రూ.2 వేలు ఇస్తామన్న భృతిని చంద్రబాబు నాయుడు సర్కార్ ఇటీవల వెయ్యి రూపాయలు చేయగా.. కేసీఆర్ మాత్రం దానికి మూడు రెట్ల నిరుద్యోగ భృతిని రాష్ట్ర నిరుద్యోగులకు అందించనున్నట్లు ప్రకటించారు.
Samayam Telugu KCR

చదవండి: తెలంగాణలో ఆంధ్రోళ్లకు పట్టిన శని చంద్రబాబు: కేసీఆర్

ఓ వైపు ఉద్యోగ నియామకాలు చేపడుతూనే మరోవైపు జాబ్ లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులను ఆదుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల్లో నిరుద్యోగ భృతికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగ భృతికి అర్హులుంటారని, అయితే 12 లక్షల మందికైనా రూ.3016 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. కేశవరావు కమిటీ త్వరలో తుది నివేదిక ఇచ్చాక మరిన్ని వివరాలపై మేనిఫెస్టో విడుదల చేస్తామని కేసీఆర్ వివరించారు.
చదవండి: TRS Manifesto: రూ.లక్ష రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పింఛన్లు రెట్టింపు.. కేసీఆర్ వరాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.