యాప్నగరం

కేసీఆర్ వెలమ కులస్థుడు, అందుకే..: పోచారం

వెలమ కులస్థులు సంకల్పం బలం, బుద్ధి బలం, ధైర్యంలో ఎవరికీ తీసిపోరని వ్యవసాయశాఖమంత్రి పోచారం

Samayam Telugu 13 May 2017, 3:30 pm
వెలమ కులస్థులు సంకల్పం బలం, బుద్ధి బలం, ధైర్యంలో ఎవరికీ తీసిపోరని వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. సమాజంలో వారి జనాభా తక్కువగా ఉన్నప్పటికీ వారు అన్ని రంగాల్లో తమకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేశారని ఆయన కొనియాడారు. నిజామాబాద్ జిల్లాలో వెలమ సంఘం ఆధ్వర్యంలో పద్మనాయక కల్యాణ మండపం నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.
Samayam Telugu kcr belongs to velama caste so he has determination
కేసీఆర్ వెలమ కులస్థుడు, అందుకే..: పోచారం


ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ వెలమలు చరిత్ర సృష్టించడంలో, అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి పాడుపడటంలో వాళ్లకు వాళ్లే సాటి అని అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించని కేసీఆర్ కూడా వెలమ కులస్థుడేనని’ ఆయన గుర్తు చేశారు. ‘కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడారని పోచారం కొనియాడారు.

కుల సంఘాలు తమ కులాల గురించే కాకుండా ఇతర కులాల అభివృద్ధికి పాటుపడినప్పుడే కులాల ఉన్నతి పెరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. చరిత్రలో వెలమలకు ఎంతో ప్రాధాన్య ఉందని...ఇప్పటికైనా వెలమల చరిత్రను లిఖించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.