యాప్నగరం

ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ లోనూ ఘనంగా జరిగాయి.

Samayam Telugu 17 Feb 2017, 2:35 pm
Samayam Telugu kcr birth day celebrations in andhra pradesh
ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ లోనూ ఘనంగా జరిగాయి. కేసీఆర్ అభిమాన సంఘం గుంటూరు తెనాలి చెంచుపేటలోని శబరి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టింది. అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతోందని, ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కేసీఆర్ అభిమాన సంఘం నేత షేక్ ఖదీర్ ఆకాంక్షించారు.


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలుగుదేశంపార్టీలో డిప్యూటీ స్పీకర్ కొనసాగుతున్న కేసీఆర్ 2001లో ఆ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రారంభించారు. 2009లో ఆయన నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చినప్పుడు..ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నాయకుల మధ్య తీవ్ర విబేధాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో ఇరు ప్రాంతాల ప్రజలు మరొకరి ప్రాంతంలో అడుగుపెట్టాలంటేనే ఆందోళన చెందేవారు. ఆంధ్ర, రాయలసీమలలో కేసీఆర్ కు వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు కొనసాగాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.