యాప్నగరం

ప్రతిపక్షాలు గొర్రెలు, చిల్లరగాళ్లు... సీఎం!

ప్రత్యర్థులను విమర్శించాలన్నా, వారు చేసిన విమర్శలను తిప్పికొట్టాలన్నా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్టైలే వేరు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

TNN 12 Jul 2017, 4:57 pm
ప్రత్యర్థులను విమర్శించాలన్నా, వారు చేసిన విమర్శలను తిప్పికొట్టాలన్నా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్టైలే వేరు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఈ రోజు కరీంనగర్‌లో ప్రారంభించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ, గొర్రెల పంపిణీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టి, ఓ రేంజ్‌‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu kcr comments against congress leaders at haritha haram phase 3 inaguration
ప్రతిపక్షాలు గొర్రెలు, చిల్లరగాళ్లు... సీఎం!


ప్రతిపక్ష గొర్రెలు, చిల్లరగాళ్లకు అధికారం తప్పా ప్రజాసంక్షేమం పట్టదని, వారి విమర్శలు అర్థరహితమని అన్నారు. ప్రతిపక్ష గొర్రెలకు విమర్శలు చేయడం తప్పా, ఏవైనా చేసిన ముఖాలు, చూసిన ముఖాలా? అంటూ కేసీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 84 లక్షల గొర్రెలను తీసుకొస్తే ఎక్కడైనా పది గొర్రెలు చనిపోవా? ప్రతిపక్షాలు కనీసం ఎనభై నాలుగు వందల గొర్రెలనైనా పంపిణీ చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పేకాట, గుడుంబాను నిర్మూలించామని, గంజాయి, హెరాయిన్ లను చీల్చి చెండాడుతున్నామని, కల్లు కల్తీ చేస్తే తోలు తీయమని ఆదేశించామని పేర్కొన్నారు.

కరీంనగర్‌ జిల్లాలోని దిగువ మానేరు డ్యామ్‌ వద్ద మొక్కను నాటిన కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు ఎర్రవల్లి గ్రామం నుంచి కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు, ప్రజలు అలగనూరు వద్ద ఘన స్వాగతం పలికారు. ఎల్‌ఎండీ కట్ట దిగువన మహాగని మొక్కను సీఎం నాటారు. నాటిన ప్రతి మొక్కనూ ఎదిగేలా చర్యలు తీసుకుంటామని సీఎం వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన కరీంనగర్ కలెక్టరేట్‌కు వెళ్లారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా 31 జిల్లాల్లో హరితహారం కార్యక్రమంలో ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఉత్సాహంగా మొక్కలు నాటుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.