యాప్నగరం

చిన్న జీయర్ స్వామికి డ్రైవర్‌గా కేసీఆర్!

జీయర్‌కు తాను డ్రైవర్ గా ఉన్నానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.....

Samayam Telugu 7 Nov 2016, 8:30 am
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామితో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన చిన్న జీయర్ షష్టిపూర్తి వేడుకల సందర్భంగా ముఖ్యఅతిథిగా కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఒకనొక సందర్భంలో జీయర్‌కు తాను డ్రైవర్ గా ఉన్నానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.....
Samayam Telugu kcr drove off china jeeyar and his guru gopalacharyulu
చిన్న జీయర్ స్వామికి డ్రైవర్‌గా కేసీఆర్!


‘22 ఏళ్ల క్రితం సిద్ధిపేటకు చెందిన ‘వికాస తరంగిణి’ కార్యకర్తలు, ఆధ్యాత్మిక సంపన్నులు నా వద్దకు వచ్చారు. మన పట్టణాన్ని అనుగ్రహించడానికి చిన్నజీయర్ స్వామివారు వస్తున్నారు. బ్రహ్మయజ్ఞం కోసం వస్తున్నారు. ఎమ్మెల్యేగా మీ సహకారం అవసరమని వారు నన్ను అడిగారు. అప్పుడు వాళ్లకు నేను ‘స్వామి వారు సిద్ధిపేటకు రాక అంటే శారద రాక, వారు వస్తే మనకు మేలు జరుగుతుంది. నా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పా. స్వామివారు సిద్ధిపేటలో ఎక్కడ ఉండాలనే సందేహం వచ్చినప్పుడు ‘మీరు ఎమ్మెల్యే కాబట్టి మీ నివాసంలో ఉంటేనే బాగుంటుందని అందరూ నాకు చెప్పారు. అంతకంటే భాగ్యం ఏముంటుందని ఆ నిర్ణయమే తీసుకున్నాం. నేనుగా నిర్మించుకున్న నా ఇంట్లో స్వామివారు ఒకవారం పాటు నా ఇంట్లో బస చేసే అవకాశం కల్పించారు. అదో అద్భుతమైన ఘట్టం. స్వామివారు సిద్ధిపేటకు వస్తూనే నేనో ప్రార్థన చేశా. ‘అయ్యా తమరు సిద్ధిపేటలో ఉన్నన్ని రోజులు నా కారే తమరి వాహానం. నేనే మీ డ్రైవర్‌ని. ఆ అవకాశం నాకివ్వాలని అడిగాను. వారు దయతో అంగీకరించారు.

సిద్ధిపేటలో ఉంటూ పరిసర ప్రాంతాల ఆలయాలకు స్వామివారు వెళ్తూ వస్తూ ఉండేవారు. స్వామి కారును నేనే డ్రైవ్ చేశా. స్వామివారితో పాటు ఆయన గురువుగారు గోపాలాచార్యులవారు కూడా కారులోనే ఉండేవారు. నేను చిన్నచిన్న ప్రశ్నలు అడుగుతూండేవాణ్ని. గోపాలాచార్యుల వారు నన్ను చాలా గట్టివాండోయ్ అంటూ మెచ్చుకున్నారు’ అని కేసీఆర్ ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ ఈ సంగతులు చెబుతున్నప్పుడు చిన్నజీయర్ ఆసక్తిగా వింటూ ఆయనవైపే చూస్తూ కనిపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.