యాప్నగరం

నిజాం అడుగుజాడల్లో కేసీఆర్: బీజేపీ

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిజాం సర్కార్ అడుగుజాడల్లో నడుస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత జి.కిషన్ రెడ్డి

Samayam Telugu 30 Apr 2017, 1:26 pm
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిజాం సర్కార్ అడుగుజాడల్లో నడుస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత జి.కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. భూసేకరణ సవరణ చట్టం బిల్లును ఆమోదించేందుకు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీకి తమను అనుమతించకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు.
Samayam Telugu kcr follows nizam rule in telanganag kishan reddy
నిజాం అడుగుజాడల్లో కేసీఆర్: బీజేపీ


గత సమావేశాల సమయంలో తమపై విధించిన సస్పెన్షన్ ఈ సమావేశాలకు ఎలా వర్తిస్తుందని ఆయన ప్రశ్నించారు. తమపై విధించిన సస్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్దనున్న అమర వీరుల స్థూపం దగ్గర నల్ల కండువాలు కప్పుకొని, నల్ల రిబ్బన్లు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్లక్లార్డులతో అసెంబ్లీకి వెళ్లారు.

మత రిజర్వేషన్లు వ్యతిరేకించినందుకే తమపై సస్పెన్షన్ విధించారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.