యాప్నగరం

Telangana CM: కేసీఆర్ ప్రమాణ స్వీకారం.. గులాబీ బాస్ అద్భుత ముహూర్తం మిస్సయారా?

గురువారం శుభ ఘడియాల్లో తెలంగాణ సీఎంగా కేసీఆర్ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. కానీ అంతకు మించి శుభ ఘడియల్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం చేసే అవకాశాన్ని ఆయన కోల్పోయారా..?

Samayam Telugu 13 Dec 2018, 1:34 pm
తెలంగాణ సీఎంగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు గతంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన మహమూద్ అలీ కూడా ప్రమాణం చేశారు. వాస్తవానికి కేసీఆర్ బుధవారమే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం సాగింది. బుధవారం మధ్యాహ్నం 12.49 గంటలకు మార్గశిర పంచమి తిథిలో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అందుకు అనుగుణంగా టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ మంగళవారం రాత్రి సమావేశమై కేసీఆర్‌ను తమ నాయకుడిగా ఎన్నుకోవాల్సి ఉంది. కానీ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారి వివరాల వెల్లడిలో ఆలస్యమైంది. ఎన్నికల సంఘం మంగళవారం నాడే గెజిట్ జారీ చేయడానికి వీల్లేకుండా పోయింది. దీంతో కేసీఆర్ ప్రమాణ స్వీకారం గురువారానికి వాయిదా పడింది.
Samayam Telugu kcr61


శుభ ముహూర్తం ఉన్నప్పటికీ కేసీఆర్ బుధవారం ప్రమాణం చేయలేకపోయారు. కానీ ఆయన గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యాదగిరి గుట్ట ప్రధాన పూజారి ఈ ముహూర్తాన్ని ఎంపిక చేశారు. పూజారి లక్ష్మీ నరసింహాచారి ఎంపిక చేసిన ముహూర్తం ప్రకారం కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం 1.24 గంటలకు ప్రారంభమైంది. ఆయన మార్గశిర షష్ఠి ఘడియల్లో బాధ్యతలు చేపట్టారు.

ఈ ముహూర్తం కేసీఆర్‌కు రాజ యోగాన్ని ప్రసాదిస్తుందని లక్ష్మీ నరసింహాచారి తెలిపారు. తిరుగులేని బలంతో, ఎలాంటి ఆటంకాలు లేకుండా పాలన సాగించడానికి ఈ ముహూర్తం ఆస్కారం కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఈ సమయంలో కేసీఆర్ జాతకంలోని అన్ని గ్రహాలు ఉచ్ఛ స్థితిలో ఉన్నాయని, ఈ ముహూర్తం కేసీఆర్‌కు అదృష్టాన్ని తీసుకొస్తుందని, ఆయన ఏది చేపట్టిన తిరుగుండదని పూజారి తెలిపారు.

అనివార్య కారణాల వల్ల బుధవారం మంచి ముహూర్తంలో సీఎంగా ప్రమాణం చేసే అవకాశాన్ని మిస్సయిన కేసీఆర్.. శుభ ఘడియల్లోనే.. రాజ యోగాన్ని ప్రసాదించే వేళ బాధ్యతలు చేపట్టడం టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.