యాప్నగరం

మెట్రో కూతకు ముహూర్తం ఖరారు..

భాగ్యనగరవాసుల కలల ప్రాజెక్టు మెట్రో రైలు కూతకు సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 28న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీని మెట్రో ప్రారంభోత్స‌వానికి ఆహ్వానిస్తూ సీఎం కేసీఆర్ బుధవారం (సెప్టెంబర్ 6) లేఖ..

TNN 7 Sep 2017, 3:59 pm
భాగ్యనగరవాసుల కలల ప్రాజెక్టు మెట్రో రైలు కూతకు సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 28న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీని మెట్రో ప్రారంభోత్స‌వానికి ఆహ్వానిస్తూ సీఎం కేసీఆర్ బుధవారం (సెప్టెంబర్ 6) లేఖ రాశారు. ఈ లేఖ‌ను ఐటీ మంత్రి కేటీఆర్ తాజాగా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని దీనికి ఆమోదం తెలిపితే అదే రోజున మెట్రో రైలు సేవలు హైదరాబాద్‌వాసులకు అందుబాటులోకి వస్తాయన్నమాట. దీనికి అనుగుణంగా అధికారులు శరవేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తున్నారు.
Samayam Telugu kcr invites narendra modi to inaugurate hyderabad metro on november 28
మెట్రో కూతకు ముహూర్తం ఖరారు..


నవంబర్‌ 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. దీనికి ఆయన ఇప్పటికే ఆమోదం తెలిపారే. ఈ నేపథ్యంలో అదే సమయంలో మెట్రోరైల్‌ను కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కేసీఆర్ ప్రధానికి లేఖలో వివరించారు. రూ. 15000 కోట్ల వ్యయంతో ప్రైవేట్‌ భాగస్వామ్యంతో చేపట్టిన దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మెట్రోరైల్‌ను కేసీఆర్‌ అభివర్ణించారు.

ప్రస్తుతం మెట్రోరైల్‌ను 3 కారిడార్లలో మొత్తం 72 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. మొదటి దశలో మియాపూర్‌-అమీర్‌పేట మార్గం 13 కి.మీ., అమీర్‌పేట-నాగోల్‌ మార్గం 17 కి.మీ. పూర్తయింది. ఈ 30 కి.మీ. మార్గం నవంబర్‌లో అందుబాటులోకి రానుంది. ఈ మార్గంలో స్టేషన్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. అమీర్‌పేటలో, సికింద్రాబాద్‌ ఒలిఫెంటా వంతెన వద్ద ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపేసి పగలూ రాత్రి మెట్రో పనులు చేస్తున్నారు.

మెట్రో రైలు ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే 3 కోచ్‌లతో కూడిన 53 మెట్రో రైళ్లు నగరానికి చేరాయి. భద్రతా పరమైన అనుమతులు కూడా వచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.