యాప్నగరం

TRS: మిగిలిన 14 స్థానాలకు త్వరలో అభ్యర్థుల ప్రకటన..

ఒకవైపు అభ్యర్థులు ఎంపిక ఖరారు చేయడంతోపాటు.. ఆ స్ధానాల్లో ఆశావహుల జాబితాను కూడా పార్టీ పరిశీలిస్తోంది. ఇందుకోసం మంత్రులు, సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు.

Samayam Telugu 22 Sep 2018, 9:54 am
తెలంగాణలో అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే తొలి విడతగా 105 స్ధానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. 14 స్థానాల అభ్యర్థులను మాత్రం ఖరారు చేయలేదు. కాగా, ఆ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధుల కోసం సర్వే చేయించిన కేసీఆర్.. నివేదిక ఆధారంగా ఆయా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఒకవైపు అభ్యర్థులు ఎంపిక ఖరారు చేయడంతోపాటు.. ఆ స్ధానాల్లో ఆశావహుల జాబితాను కూడా పార్టీ పరిశీలిస్తోంది. ఇందుకోసం మంత్రులు, సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు.
Samayam Telugu trs-flag_400x300xt


విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ పేరును అధిష్టానం ఖరారుచేసినట్లు చెబుతున్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి.. మేడ్చల్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మేడ్చల్ సిట్టింగ్ అభ్యర్ధి సుధీర్ రెడ్డికి టికెట్ కేటాయించలేదు.

మరోవైపు కాంగ్రెస్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని పార్టీలోకి తీసుకుని మేడ్చల్ టికెట్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. మల్కాజ్‌గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కనకారెడ్డికి కూడా టికెట్ దక్కలేదు. ఆయన కోడలు విజయశాంతికి టికెట్‌ దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ స్ధానాన్ని ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావుకు కేటాయించే అవకాశమూ లేకపోలేదు. ఏదేమైనా అభ్యర్థుల ఖరారుపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.