యాప్నగరం

బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కసరత్తు

తెలంగాణలో వెనుకబడిన తరగతుల (బీసీలు) రిజర్వేషన్లను పెంచేందుకు ఆ వర్గాల సామాజిక, ఆర్థిక,

Samayam Telugu 7 May 2017, 11:42 am
తెలంగాణలో వెనుకబడిన తరగతుల (బీసీలు) రిజర్వేషన్లను పెంచేందుకు ఆ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులు, వెనుకబాటుపై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని బీసీ కమిషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వేషన్లను ఏ మేరకు పెంచాలన్న అంశంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కోరింది. ఈ అధ్యయనాన్ని ఆరు మాసాల్లో పూర్తి చేయాలని సూచించింది. ఈ అధ్యయానికి సంబంధించి బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి అశోక్‌కుమార్‌ కు ఉత్తర్వులిచ్చింది.
Samayam Telugu kcr orders to survey backward classes backwardness
బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కసరత్తు


ఎస్టీ, ముస్లింలకు రిజర్వేషన్ల పెంపును ఆమోదిస్తూ తెలంగాణ శాసనసభచట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్లమెంటులో చట్టసవరణ చేయాలని కేంద్రాన్ని కూడా కోరనుంది. దీంతోపాటుగా బీసీలు,ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచాలని యోచిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు ప్రయత్నాలు ప్రారంభించింది.


తెలంగాణ ఆవిర్భావం తర్వాత, బీసీల జనాభా పెరిగిందని కమిషన్‌ సభ్యకార్యదర్శి ఇటీవల ప్రభుత్వానికి లేఖరాశారు. బీసీ సామాజిక, ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి, రిజర్వేషన్లు కూడా పెంచాలని ప్రభుత్వానికి సూచించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ల విధానాన్ని అనురించే ప్రస్తుతం బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వీటికి అదనంగా బీసీ-ఈ కేటగిరీ కింద ముస్లింలకు మరో 4 శాతం కల్పిస్తున్నారు. ప్రస్తుతం బీసీ కులాల్లో ఏ-కేటగిరీకి 7శాతం బీ-10శాతం, సీ-శాతం, డీ కేటగిరీకి 7శాతం చొప్పున రిజర్వేషన్లు ఉన్నాయి.

బీసీ కులాల జనాభాతో పాటు కుల వృత్తులు, ఆర్థిక స్థితిగతులపై బీసీ కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.