యాప్నగరం

రేవంత్‌రెడ్డికి కేసీఆర్ చెక్ పెడుతున్నారిలా..

టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి కేసీఆర్ సర్కార్‌‌కు సవాళ్లు విసురుతోన్న రేవంత్ రెడ్డికి చెక్ పెట్టెలా తెలంగాణ సర్కార్ అడుగులేస్తోంది.

TNN 17 Jan 2018, 12:10 pm
టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి కేసీఆర్ సర్కార్‌‌కు సవాళ్లు విసురుతోన్న రేవంత్ రెడ్డికి చెక్ పెట్టెలా తెలంగాణ సర్కార్ అడుగులేస్తోంది. సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే రేవంత్‌ను దెబ్బతీసేలా కేసీఆర్ సర్కార్ వ్యూహాలు రూపొందిస్తోంది. అభివృద్ధితో సొంత నియోజక వర్గంలోనే ఓడించడం ద్వారా తమకు విపక్ష నేత నోరు మూయించాలనే వ్యూహంతో అధికార పక్షం ముందుకెళ్తోంది. అందులో భాగంగానే కొడంగల్ నియోజకవర్గంపై సీఎం వరాల జల్లు కురిపించారు.
Samayam Telugu kcr sanctions development works in kodangal constituency checkmate to revanth reddy
రేవంత్‌రెడ్డికి కేసీఆర్ చెక్ పెడుతున్నారిలా..


కొడంగల్‌లో అగ్నిమాపక కేంద్రం, కోస్గి మండల కేంద్రంలో బస్ డిపో, సీఐ ఆఫీస్ ఏర్పాటుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇవే కాకుండా దౌలతాబాద్, బొంరాస్‌పేట్ మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలను మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వెంటనే వీటి ఏర్పాటుకు సంబంధించి కార్యచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రేవంత్ తమపై అసంబద్ధమైన ఆరోపణలకే పరిమితం అవుతుంటే మేం మాత్రం ఆయన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నామని చాటడమే కేసీఆర్ సర్కార్ వ్యూహంగా కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.