యాప్నగరం

పెద్దాయన మాటతో.. ఎకో ఫ్రెండ్లీగా ఖైరతాబాద్ గణపతి

ఏటా భారీ రూపంతో.. భక్తులకు కనులవిందు చేసే ఖైరతాబాద్ బడా గణేశుడు.. ఇక పర్యావరణ హితం కానున్నాడు.. పెద్దాయన చెప్పిన మాటతో..

TNN 3 Sep 2017, 10:39 am
వినాయక చవితి దగ్గర్లో ఉందంటే అందరి దృష్టి ఖైరతాబాద్ బడా గణేశుడి మీదే ఉంటుంది. ఇక్కడ ప్రతిష్టించే విగ్రహం ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్సుకత చూపుతారు. 62 ఏళ్లుగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ్ సమితి ఇక్కడ వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసింది పూజలు నిర్వహిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసే గణపతి విగ్రహాన్ని ఏటా లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటుంటారు. ఇప్పటి వరకూ ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో భారీ విగ్రహాలను రూపొందించి పూజలు చేస్తున్నారు. కానీ వచ్చే ఏడాది నుంచి పర్యావరణ హితమైన గణపతి ఇక్కడ కొలువు దీరనున్నాడు. వచ్చే సంవత్సరం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ బదులు మట్టితో చేసిన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, సహజమైన రంగులనే వినియోగించాలని ఉత్సవ్ సమితి నిర్ణయించింది.
Samayam Telugu khairatabad ganesh to be made of clay first time in 63 years
పెద్దాయన మాటతో.. ఎకో ఫ్రెండ్లీగా ఖైరతాబాద్ గణపతి



ఈ ఏడాది 57 అడుగుల ఎత్తయిన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. వచ్చే సంవత్సరం విగ్రహం ఎత్తు ఎంత ఉండాలనేది నిర్ణయించలేదని సమితి సభ్యుడు రాజ్ కుమార్ తెలిపారు. ఏడాదికి అడుగు చొప్పున విగ్రహం ఎత్తును తగ్గించడానికి గతంలో సమితి అంగీకరించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో విగ్రహాలను రూపొందించడానికి వ్యతిరేకంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌కుమార్ తెలిపారు. సమితి నిర్ణయం అమల్లోకి వస్తే.. ఖైరతాబాద్ గణేశుడి స్ఫూర్తితో రెండు రాష్ట్రాల్లోనూ పర్యావరణ హితమైన వినాయక విగ్రహాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.