యాప్నగరం

రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఖమ్మం ఎస్ఐ

బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న వ్యక్తి చిల్లర వేషాలు వేశాడు.

TNN 20 Feb 2017, 7:31 pm
బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న వ్యక్తి చిల్లర వేషాలు వేశాడు. చివరికి నవ్వుల పాలై... కటకటాల వెనక్కి వెళ్లాడు. ఖమ్మం టూటౌన్ ఎస్ ఐగా పనిచేస్తున్నాడు విజయ్. అతనికి ఫేస్ బుక్ ఎకౌంట్ ద్వారా ఓ మహిళ పరిచయమైంది. ఆమె వివాహిత. ప్రకాశం జిల్లాకి చెందిన ఆమె తన భర్తా, పిల్లలతో కలిసి హైదరాబాద్ లోని మోతీ నగర్ లో నివసిస్తోంది. విజయ్ తో నిత్యం ఛాటింగ్ చేస్తూ ఉండేది. ఇద్దరి మధ్య స్నేహం బాగా ముదిరి పోయింది. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు. చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది వారి పరిచయం. అయితే ఈ వ్యవహారం ఎప్పటి నడుస్తుందో తెలియదు కానీ... ఆ మహిళ భర్తకు వచ్చిన అనుమానంతో ఇప్పుడు బట్టబయలైంది.
Samayam Telugu khammam si vijay caught red handed over his illegal relationship
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఖమ్మం ఎస్ఐ


ఆ మహిళ భర్త వీరబ్రహ్మం సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య ప్రవర్తనపై చాలా రోజులుగా అనుమానం ఉంది. తాజాగా అతను ఆఫీసులో పని ఉందని చెప్పి నైట్ షిప్ట్ చేసేందుకు వెళ్లాడు. భర్తకు నైట్ షిఫ్ట్ అని తెలిసిన ఆ మహిళ మూడు రోజులు ముందుగానే విజయ్ ను నగరానికి పిలిపించుకుంది. కాగా వీరబ్రహ్మం భార్యపై అనుమానంతో అర్థరాత్రి ఇంటికి వచ్చి చూశాడు. తన భార్య, మరో వ్యక్తి సన్నిహితంగా ఉండడం చూసి అవాక్కయ్యాడు. ఆగ్రహంతో ఆ వ్యక్తిని బయటికి లాక్కొచ్చి పోలీసులకు కబురందించాడు. పోలీసులు విచారణ చేయగా ఆ వ్యక్తి విజయ్ అని, అతను ఖమ్మం జిల్లా టూటౌన్ ఎస్ ఐ అని తెలిసింది. విజయ్ ను పోలీసులు రిమాండ్ కు పంపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.