యాప్నగరం

గుంటూరులో కిడ్నాపై... కాశ్మీర్లో దొరికింది

గుంటూరు జిల్లాలో భట్టిప్రోలుకు చెందిన లిఖిత అనే బాలిక కనిపించకుండాపోయి నెలన్నర దాటింది.

TNN 7 Jun 2017, 2:39 pm
గుంటూరు జిల్లాలో భట్టిప్రోలుకు చెందిన లిఖిత అనే బాలిక కనిపించకుండాపోయి నెలన్నర దాటింది. ఇప్పుడు ఆమె జాడ దొరికింది పోలీసులకు. ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు మాయమాటలు చెప్పి లిఖితను ఏప్రిల్ 21న అపహరించుకుని వెళ్లాడు. అప్పట్నంచి ఆమె కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. చివరికి జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దుల్లో నాగేశ్వరరావుని పోలసీులు పట్టుకున్నారు. బాలికను కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వారిని గుంటూరు తరలిస్తున్నారు. లిఖిత అదృశ్యం కేసును ఏపీ డీజీపీ చాలా సీరియస్ గా తీసుకున్నారు. తాను కూడా కేసు విచారణలో నేరుగా పాల్గొన్నారు. తమ బిడ్డ దొరికిందని తెలిసి లిఖిత తల్లిదండ్రులు చాలా సంతోషించారు.
Samayam Telugu kidnapped girl likhitha traced in jammu kashmir
గుంటూరులో కిడ్నాపై... కాశ్మీర్లో దొరికింది


నాగేశ్వరరావు చరిత్ర మొత్తం వివాదాస్పదమే. అతను మొదట ఆర్మీలో పనిచేశాడు. ప్రవర్తన సరిగాలేకపోవడంతో డిస్మిస్ కు గురయ్యాడు. ఈయనతో పడలేక భార్య కూడా పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. బతుకుదెరువు కోసం నాగేశ్వరరావు పిల్లలను ఆటోలో స్కూలుకి తీసుకెళ్లడం ప్రారంభించాడు. అలా ఎనిమిదో తరగతి చదువుతున్న లిఖిత పరిచయమైంది. బాలికకు ఏవేవో మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. నాగేశ్వరరావు గత చరిత్రను తెలుసుకున్న పోలీసులు... అతనికి ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ వంటి ప్రాంతాలు బాగా తెలుసునని భావించారు. అక్కడికే బాలికను తీసుకెళ్లి ఉంటాడని అనుకున్నారు. ఆయా ప్రాంతాలకి టీమ్ లను పంపించారు. చివరికి జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో నిందితుడిని, బాలికను గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.