యాప్నగరం

కృష్ణా విషాదం... అధికారులే బోటు యజమానులు?

కృష్ణా, గోదావరి నదుల పవిత్ర సంగమం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన పడవ ప్రమాదంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

TNN 13 Nov 2017, 11:45 am
కృష్ణా, గోదావరి నదుల పవిత్ర సంగమం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన పడవ ప్రమాదంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రివర్ బోటింగ్ అడ్వెంచర్స్ సంస్థకు చెందిన ఈ పడవ కొండలరావు అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యింది. సదరు వ్యక్తి పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్‌కు ఇద్దరిని మాత్రమే ఎక్కించుకునే స్పీడ్ బోటుకు మాత్రమే అనుమతులు కోరారు. పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే పడవ నడిపినట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ రివర్ బోటింగ్ సంస్థ వెనుక ఏపీ పర్యటక శాఖ అధికారులు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
Samayam Telugu killer boat on maiden ride didnt have tourism nod
కృష్ణా విషాదం... అధికారులే బోటు యజమానులు?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏపీ టూరిజం శాఖకు చెందిన ఉన్నతాధికారులే ఈ బోటింగ్ సంస్థను ప్రారంభించినట్లు తెలుస్తోంది. పర్యటక శాఖకు చెందిన పలువురు ఉద్యోగులు ఇందులో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. అందువల్లే ఇతర అంశాలు వెలుగులోకి రాకుండా వీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సదరు సంస్థకు అధికారులే యజమానులు కావడంతో అనుమతులు లేకున్నా పడవ నడిపినా, టూరిజం శాఖ చూసీ చూడనట్టు వదిలేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు చీకటి పడే సమయంలో బోటు నడపకూడదన్న నిబంధనను కూడా పట్టించుకోలేదని, సరంగు (బోటు డ్రైవర్) కనీసం తన వెంట రూట్ మ్యాప్ కూడా తీసుకెళ్లలేదని ఆరోపణలున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ సూరిబాబు, సిబ్బంది రామారావు, భైరవస్వామి నదిలో ఈదుకుంటూ బయటికివచ్చి పరారయ్యారు. వీరి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.మరోవైపు మృతుల సంఖ్య పందొమ్మిదికి చేరింది. నిన్న సాయంత్రం పదహారు మంది మరణించగాగా, ఈరోజు మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.