యాప్నగరం

హైదరాబాద్ టెకీ అవయవదానం: నలుగురి జీవితాల్లో వెలుగులు!

అవయవదానం మరో నలుగురికి పునర్జన్మను ప్రసాదించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు ఇక లేదన్న బాధలో ఉండి కూడా.. మరణించిన తమ కూతురి అవయవాలను దానం చేసిన కుటుంబ సభ్యులు మరో నలుగురికి ప్రాణం పోసి ఆదర్శంగా నిలిచారు.

Samayam Telugu 13 Jul 2018, 2:48 pm
అవయవదానం మరో నలుగురికి పునర్జన్మను ప్రసాదించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు ఇక లేదన్న బాధలో ఉండి కూడా.. మరణించిన తమ కూతురి అవయవాలను దానం చేసిన కుటుంబ సభ్యులు మరో నలుగురికి ప్రాణం పోసి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. ఘట్‌కేసర్‌ ప్రాంతంలోని రాంపల్లి ఐకేగూడలో నివసించే శృతి (26) ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేస్తున్నారు. ఆదివారం (జూన్ 8) తల్లి మాధవితో కలిసి ద్విచక్రవాహనంపై ఈసీఐఎల్‌ వెళ్తుండగా కుషాయిగూడ వద్ద వీరి వాహనాన్ని గుర్తుతెలియని లారీ ఢీకొంది.
Samayam Telugu sruti


ఈ ప్రమాదంలో మాధవి అక్కడికక్కడే మృతి చెందింది. శృతి తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌‌లోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆమెకు రెండు రోజులపాటు చికిత్స చేయించారు. అయితే బుధవారం (జులై 11) ఆమె బ్రెయిన్‌డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యుల సమ్మతంతో ఆమె శరీరం నుంచి మూత్రపిండాలు, కళ్లు, కాలేయం సేకరించారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఆ అవయవాలను అమర్చి, వారికి పునర్జన్మ ప్రసాదించారు. ఇందుకు జీవన్‌దాన్‌ ప్రతినిధులు తోడ్పాటునందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.