యాప్నగరం

జనసేన, బీజేపీ కాదు.. కాంగ్రెస్ లోకి..!

ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారా..?

Samayam Telugu 11 Sep 2017, 8:50 am
గత రెండు మూడేళ్ల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీపై రకరకాల ప్రచారం సాగుతూ ఉంది. రాష్ట్ర విభజనకు అధిష్టానం పచ్చజెండా ఊపడంతో కిరణ్ కాంగ్రెస్ వీడారు. ముఖ్యమంత్రి హోదా నుంచి పార్టీని వీడి‘జై సమైక్యాంధ్రపార్టీ’ని పెట్టుకున్నారు. అయితే అప్పటికే రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో.. కిరణ్ సమైక్య వాదనకు విలువ లేకుండా పోయింది. ఆయన పార్టీ ఏపీ వ్యాప్తంగా పోటీ చేసి చిత్తైంది. కనీసం కిరణ్ సొంత నియోజకవర్గంలో కూడా ఆయన తమ్ముడు పోటీ చేసి గెలవలేకపోయాడు.
Samayam Telugu kiran kumar reddy to rejoin congress
జనసేన, బీజేపీ కాదు.. కాంగ్రెస్ లోకి..!


ఎన్నికల ఫలితాల తర్వాత కిరణ్ పూర్తిగా మొహం చాటేశారు. కానీ ఆయన రీ ఎంట్రీ ఇస్తాడని మాత్రం వార్తలు వస్తున్నాయి. ఆయన బీజేపీలో చేరబోతున్నారని ఒకసారి, కాదు జనసేనలో చేరుతున్నారు, అదీ కాదు... కిరణ్ తమ్ముడితో కలిసి తెలుగుదేశం చేరుతున్నారు... అని వార్తలు వచ్చాయి. ఇలా కిరణ్ రీ ఎంట్రీ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

ఈ పరంపరలో తాజాగా మరో రకమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు విషయం ఏమిటంటే.. కిరణ్ కాంగ్రెస్ లో చేరబోతున్నారట! తను గతంలో రాజీనామా చేసి బయటకు వచ్చిన పార్టీలోకే కిరణ్ మళ్లీ చేరబోతున్నారట. త్వరలోనే రాహుల్ ఏపీ పర్యటనకు రానున్నారని, అప్పుడు కిరణ్ కాంగ్రెస్ కండువాను కప్పుకోబోతున్నాడనేది తాజా గా వినిపిస్తున్న ఊహాగానం. ఈ విషయంపై కిరణ్ కానీ, కాంగ్రెస్ నేతలు కానీ స్పందించలేదింత వరకూ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.