యాప్నగరం

​'డీజే' ఆడుతున్న థియేటర్లో కత్తి పోట్లు..!

సినిమా చూస్తున్న ఇతర ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించారు

TNN 27 Jun 2017, 2:23 pm
మద్యం సేవించి థియేటర్ కు వచ్చి, గోల చేస్తూ... సినిమా చూస్తున్న ఇతర ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించారు కొంతమంది యువకులు. వీరికి మొదట్లో పద్ధతిగా చెప్పి చూశారంతా. అయితే ఎవరి మాట వినక తమ రీతిన రెచ్చిపోయిన ఆ యువకులపై కత్తితో దాడికి తెగబడ్డాడు మరో వ్యక్తి. దీంతో అల్లరి చేస్తు పదిమంది యువకుల్లో ముగ్గురు గాయపడ్డారు. నంద్యాలలో అల్లు అర్జున్ ‘డీజే’ సినిమా ఆడుతున్న ఖలీల్ థియేటర్లో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu knife attack in movie theater
​'డీజే' ఆడుతున్న థియేటర్లో కత్తి పోట్లు..!


రెహమాన్, రహిమాన్, షేక్ నమీర్ అనే ముగ్గురు యువకులు తమ స్నేహితులతో కలిసి డీజే సినిమాను చూడటానికి వచ్చారు. అప్పటికే తాగి ఉన్న వీరు థియేటర్లో రెచ్చిపోయి చిందులు తొక్కారు. థియేటర్ నిండుగా ఉండటంతో వీరి చేష్టల పట్ల మిగతా వాళ్ల నుంచి అభ్యంతరం వ్యక్తం అయ్యింది. కానీ మద్యంమత్తులో వీళ్లు ఎవరినీ పట్టించుకోకుండా రెచ్చిపోయారు. అడ్డుచెప్పిన ప్రేక్షకులతో ఘర్షణకు దిగారు.

ఆ తరుణంలో వడ్డె సుబ్బరాయుడు అనే మరో వ్యక్తి అల్లరి చేస్తున్న యువకులపై కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో రెహమాన్, రహిమాన్, షేక్ నమీర్ అనే ముగ్గురు యువకులు గాయపడ్డారు. వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.