యాప్నగరం

కారు ప్రమాదం నుంచి బయటపడ్డ కోదండరాం

తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్.. కారు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. చిట్యాల మండలం వెలిమనేడు సమీపంలో ఈ ఘటన జరిగింది.

TNN 11 Feb 2018, 8:18 pm
తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్.. కారు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టి.. డివైడర్‌ మీదకు దూసుకెళ్లింది. నల్లగొండ పట్టణంలో ఒక కార్యక్రమానికి హాజరైన కోదండరాం.. హైదరాబాద్ తిరిగొస్తుండగా చిట్యాల మండలం వెలిమనేడు సమీపంలో ఈ ఘటన జరిగింది. బైకుపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా విజయవాడ హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
Samayam Telugu kodandaram escapes car accident in chityal
కారు ప్రమాదం నుంచి బయటపడ్డ కోదండరాం


ప్రమాదం నుంచి కోదండరాం సురక్షితంగా బయటపడ్డారని టీజేఏసీ అధికార ప్రతినిధి వెంకట్‌ రెడ్డి తెలిపారు. కారు ప్రమాదానికి గురవగానే బెలూన్‌ తెరుచుకోవడంతో లోపల ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోదండరాం మరో వాహనంలో హైదరాబాద్‌ వెళ్లిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.