యాప్నగరం

కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం కలకలంరేపింది. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 22 Aug 2018, 3:28 pm
కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం కలకలంరేపింది. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్‌కు డాక్టర్లు వైద్యం అందిస్తుండగా.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పురుగుల మందు తాగే ముందు శ్రీకాంత్ ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. ఎందుకు ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందో ఆ వీడియోలో వివరించాడు.
Samayam Telugu Suicide


సెల్పీ వీడియోలో ఏపీ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీర లంకయ్యపై ఆరోపణలు చేశారు. వీర లంకయ్య తనపై కక్ష సాధిస్తున్నారని శ్రీకాంత్ చెప్పాడు. తన మీద కోపంతో కొందరు క్రీడాకారుల్ని ఇబ్బంది పెడుతున్నాడని.. వారిని కబడ్డీకి దూరం చేస్తున్నారని ఆరోపించాడు. లంకయ్యకు కేఈ ప్రభాకర్ కూడా అండగా ఉన్నారని.. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నాడు. తన మరణంతోనైనా క్రీడాకారులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం ఇప్పుడు ఏపీ కబడ్డీ అసోసియేషన్‌లో సంచలనంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.