యాప్నగరం

భవన వ్యర్థాల తరలింపు వాహనాలను ప్రారంభించిన కేటీఆర్

స్వచ్ఛత విషయంలో మెట్రో నగరాలన్నింటి కంటే హైదరాబాద్ ముందుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ ఆవరణలో మంగళవారం (డిసెంబర్ 12) ఆయన భవన వ్యర్థాలను తరలించే వాహనాలను ప్రారంభించారు.

TNN 12 Dec 2017, 7:25 pm
స్వచ్ఛత విషయంలో మెట్రో నగరాలన్నింటి కంటే హైదరాబాద్ ముందుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ ఆవరణలో మంగళవారం (డిసెంబర్ 12) ఆయన భవన వ్యర్థాలను తరలించే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నగరంలో స్వచ్ఛ పాఠశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, మార్కెట్లకు స్వచ్ఛ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా, స్లమ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
Samayam Telugu ktr flagged off construction and demolition waste collection vehicles in hyderabad
భవన వ్యర్థాల తరలింపు వాహనాలను ప్రారంభించిన కేటీఆర్


తొలి దశలో భాగంగా నాగోల్, జీడిమెట్లలో బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ ట్రాన్స్‌పోర్ట్ కోసం 20 వాహనాలను సిద్ధం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. తడి, పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన కల్పించామని, 44 లక్షల డస్ట్‌బిన్‌లను ఉచితంగా పంపిణీ చేశామని ఆయన గుర్తు చేశారు. డంపింగ్ యార్డ్ కోసం ఇతర ప్రాంతాలను పరిశీలిస్తున్నామని, జవహర్‌నగర్‌లో 20 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ పవర్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు.

‘స్వచ్ఛత అనేది నిరంతర ప్రక్రియ. పురపాలన అంటే పౌరుల భాగస్వామ్యంతో పాలన. పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు డిసెంబర్ 16న కుత్బుల్లాపూర్ నుంచి మన నగరం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’ అని కేటీఆర్ అన్నారు.

అనుకున్నదానికంటే మెట్రో ఎక్కువగా విజయవంతమైందని కేటీఆర్ తెలిపారు. రోజుకు 15 లక్షల మంది ప్రయాణించేలా మెట్రోను రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని, నీటి సరఫరాలో గణనీయమైన పురోగతి సాధించామని కేటీఆర్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.