యాప్నగరం

KTR.. ఓడితే సర్దుకొని అమెరికా వెళ్లిపోతారా? లగడపాటితో వాట్సప్ చాట్‌, నిజమెంత?

ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే కేటీఆర్ తట్టా బుట్టా సర్దేస్తారా? అమెరికా వెళ్లిపోతారా? లగడపాటితో కేటీఆర్ వాట్సాప్ చాట్ అంటూ ప్రచారం. ఇందులో నిజమెంతో తెలుసుకోండి.

Samayam Telugu 5 Dec 2018, 12:23 pm
ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో విడుదలైన లగడపాటి సర్వే తెలంగాణ రాజకీయాల్లో వేడి పెంచింది. 2014 కంటే పోలింగ్ పెరిగితే ప్రజా కూటమికే విజయావకాశాలు ఉన్నాయని ఆయన తేల్చారు. తగ్గితే హంగ్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ప్రజా కూటమికే విజయావకాశాలు ఉన్నాయన్న లగడపాటి అంచనాలు టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదు. ఈ సర్వే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందన్న కేటీఆర్.. చంద్రబాబు నాయుడి ఒత్తిడితోనే లగడపాటి సర్వే తారుమారైందన్నారు.
Samayam Telugu lagadapati


నవంబర్‌ 20వ తేదీన రాజగోపాల్‌ తనకు పంపిన మెస్సేజ్‌లో టీఆర్‌ఎస్‌ 65 నుంచి 70 సీట్లు, ప్రజా కూటమి 35-40 సీట్లు, బీజేపీ 2-3 సీట్లు, ఎంఐఎం 6 లేక 7 సీట్లు, ఇతరులు ఒకటి లేదా రెండు స్థానాల్లో నెగ్గుతారని సర్వే వివరాలు వెల్లడించారని కేటీఆర్‌ స్క్రీన్‌ షాట్లు షేర్‌ చేశారు.

కేటీఆర్ వాట్సాప్ చాట్ వివరాలను బహిర్గతం చేయడంతో... ఆయనతో లగడపాటి చాటింగ్ చేసిన ఇదేనంటూ ఓ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ‘క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది. ఎన్నికల గురించి నేను వింటోంది నిజమేనా? మీ గురించి బెంగగా ఉంది’ అని ఆ చాట్‌ చేసిన వ్యక్తి రావు కె.టి.తో చాట్ చేశారు.

దీనికి బదులుగా.. ‘ఇవి రాజకీయాలు, పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు మెరుగ్గా ఉన్న మా అవకాశాలు ఇప్పుడు సన్నగిల్లుతున్నాయి. మా సర్వేలు ఆనందాన్ని కలిగించడం లేదు. నాన్న సమర్థవంతంగా వ్యవహరించలేకపోతుండటం చిరాకు తెప్పిస్తోంది. మేం గెలవకపోతే.. నేను అమెరికా వెళ్తా లేదంటే వేరే దేశం వెళ్తాను. అంతేగానీ ప్రతిపక్షంలో మాత్రం కూర్చోన’ని కేటీఆర్ తెలిపారు.

వైరల్‌గా మారిన ఈ చాట్ ఫేక్ అని తేలింది. ఈ చాటింగ్‌తో తనకు సంబంధం లేదని లగడపాటి మీడియాకు తెలిపారు. ఆయన అమెరికా వెళ్తానని నాతో చెప్పలేదు. కేసీఆర్ గురించి కూడా ఆయన నాకేమీ చెప్పలేదని లగడపాటి స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.