యాప్నగరం

కేటీఆర్ సర్, నా తమ్ముడిని కాపాడండి!

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ట్విట్టర్ ద్వారా తనకు అందే ఫిర్యాదులపై వెంటనే స్పందించి, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆయన ప్రజల మన్ననలు పొందుతున్నారు.

TNN 21 Nov 2017, 12:40 pm
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ట్విట్టర్ ద్వారా తనకు అందే ఫిర్యాదులపై వెంటనే స్పందించి, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆయన ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ సందర్భంగా మహబూబున‌గర్‌కు చెందిన కత్రావత్ రాజు అనే యువకుడు తన తమ్ముడు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితిని కేటీఆర్‌కు తెలుపుకున్నాడు. ‘‘కేటీఆర్ సర్, నా తమ్ముడు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్సకు దాదాపు రూ.10 లక్షలు ఖర్చవుతుంది. మా ఆస్తులు కూడా అంతా విలువ చేయవు. మా నాన్న కూలి పని చేస్తాడు. నాకు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. దయచేసి సాయం చేయండి’’ అని కోరాడు. ట్విట్టర్‌లో పోస్టు చేసిన మెడికల్ రిపోర్ట్ ప్రకారం రాజు తమ్ముడు రామ్‌చరణ్‌కు 10 ఏళ్లని తెలిసింది. అతడి అభ్యర్థనపై కేటీఆర్ వెంటనే స్పందించారు. త్వరలోనే తమ అధికారులు ఫోన్ చేసి సాయం చేస్తారని కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
Samayam Telugu ktr responds on 10 year boys blood cancer treatment request tweet
కేటీఆర్ సర్, నా తమ్ముడిని కాపాడండి!

Respected sir,My brother is suffering from BLOOD CANCER.The cost of the treatment is about 10 lakhs.even my property too less then that.My father is a labour and i have 3 sisters please help us sir.our contact no:9493737187 8142260831 we are from :mahaboobnagar dist,@KTRTRS pic.twitter.com/XNZn66b4So — Katravath raju (@Katravathraju8) November 20, 2017 My office will contact you soon @KTRoffice https://t.co/LMADfr8KCN — KTR (@KTRTRS) November 20, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.