యాప్నగరం

జపాన్‌లో చిరంజీవి.. ఆశ్చర్యపోయిన కేటీఆర్!

సాధారణంగా మనం వేరే రాష్ట్రానికో, దేశానికో వెళ్లినప్పుడు అక్కడ మనకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే మన ఆనందానికి అవధులుండవు.

TNN 18 Jan 2018, 5:42 pm
సాధారణంగా మనం వేరే రాష్ట్రానికో, దేశానికో వెళ్లినప్పుడు అక్కడ మనకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే మన ఆనందానికి అవధులుండవు. ఒకవేళ వేరే దేశానికి వెళ్లినప్పుడు అక్కడ మన అభిమాన హీరో ఫొటోలు గోడల మీద కనిపిస్తే.. అబ్బా! అని మురిసిపోతాం. ఇప్పుడు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ది అదే పరిస్థితి. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న కేటీఆర్.. గురువారం హమామట్సు అనే చిన్న పట్టణంలో ఉన్న సుజుకి మ్యూజియంను సందర్శించారు. అయితే ఆ మ్యూజియంలో మెగాస్టార్‌ చిరంజీవి ఫొటోను చూసి కేటీఆర్‌ ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ ఫొటోలు పోస్ట్‌ చేశారు.
Samayam Telugu ktr visits suzuki museum at hamamatsu in japan
జపాన్‌లో చిరంజీవి.. ఆశ్చర్యపోయిన కేటీఆర్!


‘షిజ్వోకాలోని హమామట్సులో ఉన్న సుజుకి మ్యూజియంలో పర్యటించాను. పర్యటన చాలా అద్భుతంగా అనిపించింది. కానీ ఇక్కడ నేను ఎవరి ఫొటో చూశానో ఊహించగలరా? మనకే సొంతమైన మెగాస్టార్‌ చిరంజీవి గారు. మన మాతృభూమికి చెందిన ఒకరి ఫొటోను జపాన్‌లోని హమామట్సులాంటి చిన్నపట్టణంలో చూడటం చాలా బాగా అనిపించింది’ అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Had a tour of the Suzuki museum at Hamamatsu in Shizuoka prefecture The tour was great but guess whose picture I get to see there? Our own Mega Star Chiranjeevi Garu 😎 Felt nice to see someone from our motherland being recognised in a small town in Japan 👍 pic.twitter.com/927uGbmYnd — KTR (@KTRTRS) January 18, 2018
అక్కడ చిరంజీవి ఫొటో మాత్రమే కాదు.. వినాయకుడు, మహాత్మగాంధీ, తాజ్‌మహల్, భారత కరెన్సీ ఒకే ఫ్రేమ్‌లో పెట్టి ఉన్నాయి. ఏదేమైనా మన అభిమాన హీరో, మెగాస్టార్ చిరంజీవి ఫొటో సుజుకి మ్యూజియంలో ఉండటం నిజంగా మనకి గర్వకారణమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.