యాప్నగరం

కేటీఆర్ బంధువునంటూ ఓ వ్యక్తి దౌర్జన్యం..!

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బంధువునంటూ రెవెన్యూ అధికారులపై ఓ వ్యక్తి దౌర్జన్యానికి దిగాడు. దీంతో.. అతనిపై చర్యలు

Samayam Telugu 16 Mar 2018, 10:05 am
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బంధువునంటూ రెవెన్యూ అధికారులపై ఓ వ్యక్తి దౌర్జన్యానికి దిగాడు. దీంతో.. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ, సైబరాబాద్ పోలీసులకి ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. విషయంలోకి వెళితే.. కుత్బుల్లాపూర్ రెవెన్యూ పరిధిలోని ఫాక్స్‌సాగర్ చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు కేటీఆర్‌కి ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఈ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ కలెక్టర్‌ని ఆదేశించారు.
Samayam Telugu ktrs twitter account flooded with complaints
కేటీఆర్ బంధువునంటూ ఓ వ్యక్తి దౌర్జన్యం..!


కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారుల్ని అప్రమత్తం చేయడంతో.. స్థానిక అధికారులు అక్రమ నిర్మాణాల్ని ప్రొక్లెయిన్ సాయంతో కూల్చివేస్తుండగా.. అక్కడికి చేరుకున్న రంగారావు అనే వ్యక్తి అధికారులపై దౌర్జన్యానికి దిగాడు. తాను కేటీఆర్‌ బంధువునంటూ వారిపై చేయి చేసుకున్నాడు. ఈ తతంగమంతా ఓ టీవీ ఛానల్‌లో ప్రసారం కావడంతో.. ఓ నెటిజన్ ‘కేటీఆర్ సర్.. ఈ వీడియోకి ఏమని సమాధానం చెప్తారు..?’ అని ట్వీట్ చేశాడు. దీంతో.. దాడికి దిగిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Request @TelanganaDGP @cpcybd to look into this and take action against the gentleman if found guilty https://t.co/yGxj9mpfFN — KTR (@KTRTRS) March 15, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.