యాప్నగరం

రేపటి నుంచి ఎల్బీనగర్‌ చౌరస్తా క్లోజ్!

హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొద్దున్న ఆఫీసులు, కాలేజీల సమయంలో.. మళ్లీ సాయంత్రం ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాం.

TNN 7 Oct 2017, 10:01 am
హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొద్దున్న ఆఫీసులు, కాలేజీల సమయంలో.. మళ్లీ సాయంత్రం ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాం. గంటలు తరబడి వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేక పోలీసులు కూడా అలాగే నలిగిపోతున్నారు. నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌ జాం సమస్యను పరిష్కరించే క్రమంలో రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. కూడళ్లలో యు టర్న్‌ పద్ధతిని తీసుకొచ్చారు. దీనిలో భాగంగా తాజాగా ఎల్బీనగర్‌ చౌరస్తాలోనూ ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
Samayam Telugu lb nagar chowrasta to be closed from sunday
రేపటి నుంచి ఎల్బీనగర్‌ చౌరస్తా క్లోజ్!


ఇప్పటికే పలు కూడళ్లలో యు టర్న్‌ పద్ధతి సఫలమైన నేపథ్యంలో నిత్యం వేలాది వాహనాలతో బారులుతీరే ఎల్బీనగర్‌ కూడలిలోనూ ఈ పద్ధతిని ఆదివారం నుంచి అవలంబించబోతున్నట్లు తెలిపారు. మెట్రోరైలుతోపాటు, స్కైవే పనులు సైతం జరుగుతున్నందున ఈ చౌరస్తాలో ట్రాఫిక్ జాం నిత్య నరకం. దీని నుంచి వాహనదారులకు ఉపసమనం కలిగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం నుంచి ఎల్బీనగర్‌ కూడలిని మూసివేసి ఇటు ఎల్‌పీటీ మార్కెట్‌, అటు డీమార్ట్‌ ముందు యు టర్న్‌లు తెరుస్తారు.

అయితే హైదరాబాద్‌-విజయవాడ ప్రధాన రహదారిలో యథావిధిగా రాకపోకలు ఉంటాయి. విజయవాడ నుంచి ఉప్పల్‌ వెళ్లే వాహనాలు ఎల్బీనగర్‌ చౌరస్తా దాటాక డీ మార్ట్‌ వద్ద కుడివైపు యు టర్న్‌ తీసుకోవాలి. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి సాగర్‌ రింగ్‌ రోడ్డువైపు వెళ్లే వాహనాలు చౌరస్తా దాటాక ఎల్పీటీ మార్కెట్‌ వద్ద కుడివైపు యు టర్న్‌ తీసుకోవాలి. ఉప్పల్‌ నుంచి సాగర్‌ రోడ్డు, దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లే వాహనాలు ఎల్బీనగర్‌ చౌరస్తాలో ఎడమవైపు మలుపు తీసుకుని ఎల్పీటీ మార్కెట్‌ వద్ద కుడివైపు యు టర్న్‌ తీసుకోవాలి. ఇక సాగర్‌ రోడ్డు నుంచి ఉప్పల్‌ వెళ్లే వాహనాలు చౌరస్తాలో ఎడమవైపు మలుపు తిరిగి డీ మార్ట్‌ వద్ద యుటర్న్‌ తీసుకోవాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.