యాప్నగరం

పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి నేతల కన్నీటి నివాళి

హిమాచల్ ప్రదేశ్ లో గుండెపోటుతో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి

Samayam Telugu 10 Jun 2017, 11:49 am
హిమాచల్ ప్రదేశ్ లో గుండెపోటుతో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు కులు వెళ్ళిన ఆయన శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలారు. శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన మృతదేహాన్ని ఢిల్లీకి తరలించారు. జీఆర్జీ రోడ్డులోని ఆయన నివాసానికి తరలించగా అక్కడ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు పాల్వాయి పార్ధివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం హైదరాబాద్ తరలించారు.
Samayam Telugu leaders pay tributes to palvai govardhan reddy
పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి నేతల కన్నీటి నివాళి


ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఆయన నివాసంలో పాల్వాయి పార్దివదేహాన్ని అన్ని రాజకీయ పార్టీల నేతలు సందర్శించి నివాళులు అర్పించారు. తెలంగాణ తొలి, మల దశ ఉద్యమాల్లో పాల్వాయిది ప్రముఖ పాత్ర అని పలువురు గుర్తు చేసుకున్నారు.

ముక్కుసూటితనంతో ఆయన రాజకీయాల్లోని చెరగని ముద్ర వేశారని కేంద్రమాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి కొనియాడారు. పార్టీలు వేరైనా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలిసి ఉద్యమించాని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. తెలంగాణరాష్ట్ర సాధనలో పార్టీ హైకమాండ్ ఒప్పించడంలో పాల్వాయి ఎనలేని కృషి చేశారని పలువురు పార్టీ నేతలు గుర్తు చేశారు.

శనివారం సాయంత్రం ఆయన స్వగ్రామం నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడలో ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.